News and Entertainment

నిద్రలో నడిచే అలవాటులా.. నిద్రలో సెక్స్ చేసే అలవాటు.. దురదృష్టం వెంటాడితే తప్ప ఇలాంటి జబ్బు రాదు


సెక్సోమ్నియా .. దీని పేరు ఎప్పుడైనా, ఎక్కడైనా విన్నారా? విని ఉండరు. ఎందుకంటే ఇది చాలా వింత జబ్బు. ఎవరికో, ఎక్కడో దురదృష్టం వెంటాడితే తప్ప రాదు. దీని కేసులు చాలా విచిత్రంగా, భయాన్ని కలిగించేలా ఉన్నాయి.
నిద్రలో నడిచే అలవాటు కొంతమందికి ఉంటుంది కదా. అలాంటి జబ్బే ఇది. కాని ఇక్కడ నిద్రలో సెక్స్ చేస్తారు. నిద్రలో ఉన్నామో, మేలుకోని ఉన్నామో అర్థం కాకుండా ఉంటారు. నిద్రలో హస్తప్రయోగం చేయడం, భావప్రాప్తి కలిగినట్టు మాట్లాడటం, అరవడం, ఇలా సెక్స్ లో చేసే ఏ పని అయినా చేసేస్తారు.
ఈమధ్య కాలంలో వచ్చిన కేసుల్లో, ఒక భార్య భర్తతో సెక్స్ చేసి పడుకున్నాక కూడా, తన భర్త హస్తప్రయోగం చేసుకోవడం గమనించింది. ఇలా తరచుగా జరుగుతుండంటంతో, తన భర్తని సుఖపెట్టలేకపోతున్నానేమో అని బాధపడింది మొదట. ఆ తరువాత డాక్టర్లను కలిస్తే అసలు విషయం బయటపడింది. అతనికి సెక్సోమ్నియా జబ్బు ఉంది. 


ఒక్క అమ్మాయి, ఇదే జబ్బుతో హస్తప్రయోగం చేసుకుంటూ, యోనిలో అద్దంతో తయారుచేసిన వస్తువును పెట్టుకోవడం తో తీవ్రంగా గాయపడింది. ఇక రెండెళ్ళ కిందట, ఇదే జబ్బుతో ఒక అమ్మాయిని అనుకోకుండా రేప్ చేసేసాడు ఒక స్వీడన్ అబ్బాయి.

ఇంత ప్రమాదకరమైన ఈ జబ్బుకి కారణాలు ఏంటో డాక్టర్లు కనిపెట్టలేకపోతున్నారు. కాని రానురాను ఈ జబ్బు పెరిగే అవకాశాలు ఎక్కువున్నాయని డాక్టర్స్ చెపుతున్నారు.