News and Entertainment

శివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయకూడదా? శివాలయంలో మీరు చేస్తున్న పాపాలు తెలుసుకోండి..



దేవాలయానికి వెళ్తే ప్రదక్షిణలు చేయడం మామూలే. అయితే శివాలయం చుట్టూ మాత్రం మిగతా ఆలయాలకు చేసే పద్ధతిలో  ప్రదక్షిణలు చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎందుకంటే... శివుడు దేవదేవుడు. అంటే... దేవుళ్లకే దేవుడు. కాబట్టి... ఆయన గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే శివుడి ఉన్నతత్వాన్ని తక్కువ చేసినట్టు అవుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. అదేవిధంగా... పరమేశ్వరుడి తలపై నుండి జాలువారే గంగ... గుడిలోని శివలింగాన్ని అభిషేకించి, పీఠం కిందుగా ఏర్పాటు చేసిన కాలువగుండా బయటకు ప్రవహిస్తూ ఉంటుందని అంటారు. ప్రదక్షిణలు చేసేటప్పుడు ఆ గంగను దాటాల్సి వుంటుంది. పవిత్ర గంగను దాటడం సరికాదనే ఉద్దేశంతో ప్రత్యేకమైన ప్రదక్షిణ విధానాన్ని ఏర్పరిచారని పండితులు చెబుతున్నారు.

శివాలయ ప్రదక్షిణా విధానం:: చండీ ప్రదక్షిణం లేదా సోమసూత్ర ప్రదక్షిణం::
మిగిలిన దేవాలయాలలో వలే ఈశ్వరుని దేవాలయంలో ప్రదక్షీణ చేయకూడదు. దానికి ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంది. దీనిని చండీ ప్రదక్షిణమని, సోమసూత్ర ప్రదక్షిణమని కూడా అంటారు.

లింగ పురాణంలో ఈ విధానం గురించి స్పష్టంగా పేర్కొనబడింది!!
నందీశ్వరుని(ధ్వజస్థంభం) వద్ద ప్రారంభించి - ధ్వజస్థంభం దగ్గరనుండి చండీశ్వరుని దర్శించుకుని అక్కడనుండి మళ్లీ వెనుకకు తిరిగి ధ్వజస్థంభం దగ్గరకు వచ్చి....ప్రదక్షిణ మొదలుపెట్టి సోమసూత్రం (అభిషేకజలం బయటకు పోవుదారి) వరకు వెళ్ళీ వెనుకకు తిరిగి మరలా ధ్వజస్థంభం దగ్గర ఒక్కక్షణం ఆగి అదేవిధంగా సోమసూత్రం వరకు రావాలి. అక్కడినుండి...

తరువాతి పేజిలో ఇంకా ఉంది..