News and Entertainment

జియో కస్టమర్‌కు 27 బిల్లు.. షాక్‌ అయిన కస్టమర్‌



రిలయన్స్‌ జియో ప్రస్తుతం దేశంలోని టెలికాం రంగంను పూర్తిగా మార్చేసింది. ఫ్రీ డేటా మరియు ఫ్రీ కాలింగ్‌ అంటూ జియో వచ్చి మొత్తం మార్చేసింది. మూడు నెలల పాటు ఫ్రీ డాటాను ఇస్తున్నట్లుగా ఆరంభంలోనే జియో అధినేత ముఖేష్‌ అంబాని ప్రకటించిన విషయం తెల్సిందే. డిసెంబర్‌ 31 వరకు ఎంత డాటా వాడినా, ఎంతగా కాల్స్‌ చేసుకున్నా కూడా ఒక్క రూపాయి కూడా బిల్లు పడేది లేదు. అయితే తాజాగా కొల్‌కత్తాలోని ఒక జియో వినియోగదారుడికి 27 వే రూపాయల బిల్లును పంపడం జరిగింది.


550 జీబీ డేటాను వాడటం వల్ల 27 బిల్లు వచ్చినట్లుగా ఆ కస్టమర్‌ చెప్పుకొచ్చాడు. అయితే ఆ బిల్లును చూసిన ఆ కస్టమర్‌ ఒక్కసారిగా షాక్‌ అయ్యాడు. ఏం చేయాలో పాలుపోక దాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. తనకు జియో నుండి 27 వేల రూపాయల బిల్లు వచ్చింది అంటూ సోషల్‌ పోస్ట్‌ చేశాడు. దాంతో ఆ పోస్ట్‌ వైరల్‌ అయ్యింది. జియో నుండి వచ్చిన బిల్లుపై ఉన్నతాధికారులు స్పందించారు. సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం అబద్దం అని, తాము ఏ కస్టమర్‌కు కూడా బిల్లును ఇప్పటి వరకు పంపింది లేదు అని జియో అధికారులు చెబుతున్నారు. ఎవరో కావాలని ఈ విధంగా ప్రచారం చేస్తున్నట్లుగా వారు చెబుతున్నారు.