News and Entertainment

ప్రాక్టికల్ లో మార్కులు వేస్తా.... నువ్వు నా గదికొచ్చి ఆ ప్రాక్టికల్స్ చేస్తే...



తన కోరిక తీరిస్తే ప్రాక్టికల్ పరీక్షల్లో మార్కులు వేస్తానని చెప్పి ఓ అమ్మాయిని సాక్షాత్తూ స్కూలు ప్రిన్సిపాల్ వేధించిన ఘటన చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని రాయ్‌ఘడ్ జిల్లాలో జరిగింది.
సరియా పోలీసు స్టేషను పరిధిలోని సరస్వతీ శిశుమందిర్ ప్రిన్సిపాల్ 12వ తరగతి చదివే ఓ 17 ఏళ్ల అమ్మాయిని గదిలోకి పిలిచి తన కోరిక తీరిస్తే ప్రాక్టికల్ పరీక్షల్లో మార్కులు వేస్తానని చెపుతూ ఆమెను లైంగికంగా వేధించాడు.

ఈ సంఘటనపై ఆమె ఇంటికి వచ్చి తల్లితండ్రులకు విషయం చెప్పింది. తల్లిదండ్రులు స్కూలు యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోక పోవడంతో వారు పోలీసులను ఆశ్రయించారు.