News and Entertainment

జియో పూర్తి ఫ్రీ అనుకొని హాయిగా వాడేసుకుంటున్నారా? అయితే ఈ వార్త చదివితే కచ్చితంగా షాక్ అవుతారు.



జియో ఇంటర్నెట్, కాల్స్ పూర్తి ఫ్రీ అనుకొని హాయిగా వాడేసుకుంటున్నారా? అయితే ఈ వార్త చదివితే కచ్చితంగా షాక్ అవుతారు. రిలయన్స్ ప్రతిష్టాత్మకంగా టెలికాం రంగంలోకి ప్రవేశపెట్టిన జియో ఎన్నో సంచలనాలు సృష్టించింది. మార్కెట్‌లోకి వచ్చిన కొంతకాలంలోనే రికార్డు స్థాయిలో వినియోగదారులు జియో సిమ్‌ను తీసుకున్నారు. అందుకు కారణం జియో ప్రకటించిన వెల్‌కం ఆఫర్లే. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా.. ఇంటర్నెట్, కాల్స్, ఎస్‌ఎంఎస్ ఇలా అన్ని ఫ్రీగా ఇచ్చేసింది జియో. ఈ ఆఫర్ డిసెంబర్ 31 వరకు వర్తిస్తుందని ప్రకటించింది.



కాగా జియో తాజాగా ఓ వినియోగదారుడికి షాక్ ఇచ్చింది. పూర్తిగా ఫ్రీ అనుకొని సదరు వినియోగదారుడు జియో 4జి నెట్‌ను విచ్చలవిడిగా వాడేసుకున్నాడు. అందుకుగాను అతడికి జియో బిల్ పంపించింది. అతడు జియో సిమ్‌పై నవంబర్ 20 తేదీ వరకు ఏకంగా 550 జిబి నెట్ వాడాడు. దీంతో సదరు వ్యక్తికి జియో 27వేల రూపాయిలకు పైగా బిల్లు పంపించింది. బిల్లు చూసిన వినియోగదారుడు ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. ఫ్రీ అనుకుంటే ఇంత బిల్లు రావడంతో అతడికి ఎటూ తోచలేదు. దీంతో అతడు తనకు జియో పంపిన బిల్లును తీసి ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసి తన గోడు వెళ్లబోసుకున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌మీడియాల్లో హల్‌చల్ చేస్తుంది. అయితే ఇది నకిలీ బిల్లు అని కొందరు వాదిస్తున్నారు.. కానీ ఇదే నిజమైతే ప్రస్తుతం జియో వాడుతున్న వారు మాత్రం వేల రూపాయిల బిల్లు కట్టేందుకు సిద్ధపడండీ… అయితే దేని మీద రిలయన్స్ జియో అధికారులు ఇది నిజం కాదు అని చెప్తున్నారు. రిలయన్స్ జియో ఇంత వరకు ఎవ్వరికి బిల్  పంపలేదు  అని  జియో అధికారులు చెప్పారు…