News and Entertainment

ఆడవాళ్ళ నైటీలపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఉత్తేజ్అసిస్టెంట్ డైరెక్టర్ గా తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన క్యారక్టర్ ఆర్టిస్ట్ ఉత్తేజ్, ‘శివ’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయమయ్యారు. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రధాన శిష్యుడిగా ఎదిగిన ఉత్తేజ్, రచయితగాను అతి తక్కువ కాలంలోనే వృద్ధి చెందారు. దేశభక్తి కానీ, స్త్రీలని గౌరవించటంలో ఎప్పుడు ముందుండే ఉత్తేజ్ తాజాగా మహిళలు ధరించే నైటీలపై కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. “ఒకప్పుడు నైటీలని ఆడవాళ్ళూ రాత్రి సమయంలోనే ధరించేవారు. కానీ ప్రస్తుత కాలంలో మహిళలు ఎక్కువగా అలానే బయటకి వస్తున్నారు. అంతే కాకుండా అలానే స్కూటీ నడుపుతున్నారు. ఇలా చేయటం తగదని” ఒక ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో బహిరంగంగానే ఉత్తేజ్ అన్నారు. అంతే కాకుండా ‘అలానే బయటకి వస్తే కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతాయని, షాపింగ్ చేసే సమయంలో కూడా అలానే వస్తున్నారని, ఇలా రావటం వలన అల్లరి పాటు కూడా అవుతారని’ ఉత్తేజ్ అభిప్రాయపడ్డారు.


బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఐన ఉత్తేజ్, నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నా గత కొన్ని సంవత్సరాలుగా సినిమాలలో అతనికి అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతం తన కూతురు చేతన హీరోయిన్ గా తెలుగు తెరకి పరిచయమవుతున్నారు. అయితే తాజాగా ఉత్తేజ్ చేసిన వ్యాఖ్యలు మాత్రం కాస్తంత ఉద్వేగాలు రగిల్చేలా వున్నాయి. మరి దీనిపై మహిళా సంఘాలు ఎలా స్పందిస్తారో..?