News and Entertainment

రోజా బికినీపై టీడీపీ ఎమ్మెల్యే కామెంట్


గతంలో అసెంబ్లీ సాక్షిగా బూతులతో రెచ్చిపోయిన వైకాపా లేడీ ఫైర్ బ్రాండ్, న‌గ‌రి ఎమ్మెల్యే ఆర్‌కె.రోజా, టీడీపీ విజ‌య‌వాడ సెంట్ర‌ల్ ఎమ్మెల్యే బోండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు మ‌రోసారి ఒక‌రిపై మ‌రొక‌రు రెచ్చిపోయారు. విశాఖ‌లో ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మంగా నిర్వ‌హించ‌త‌ల‌పెట్టిన బీచ్ ఫెస్టివ‌ల్ వీరి మ‌ధ్య వివాదానికి కార‌ణ‌మైంది. ఈ అంశంపై రోజా మాట్లాడుతూ ముస‌లి సీఎం చంద్ర‌బాబు ఈ వ‌య‌స్సులో బీచ్‌ఫెస్టివల్‌ నిర్వహిస్తూ తెలుగు మహిళల పరువు తీస్తున్నారని ఆమె తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు.

త‌మ అధినేత జ‌గ‌న్ 40 సంవ‌త్స‌రాల వ‌య‌స్సులో కూడా ఏపీకి ప్ర‌త్యేక హోదాతో పాటు మ‌హిళా స‌మ‌స్య‌ల‌పై పోరాడుతుంటే చంద్ర‌బాబు ముస‌లి వ‌య‌స్సులో పిచ్చి పిచ్చి ప‌నులు చేస్తున్నారంటూ రోజా చంద్ర‌బాబుపై ప‌డిపోయారు. ఇక పార్టీలో మండల స్థాయిలో క్యాడర్‌ నిర్మాణం ఎలా జరుగుతుందో తెలియని లోకేష్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎలా అయ్యాడని ఆమె ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం త‌మ పార్టీ వైకాపా ఎంపీలు రాజీనామాలు చేసేందుకు రెడీగా ఉన్నార‌ని…టీడీపీ ప్ర‌జా ప్ర‌తినిధులు కూడా ఇందుకు సిద్ధ‌మేనా అని ఆమె స‌వాల్ విసిరారు.

రోజా సవాల్కు స్పందించిన బోండా ఉమా మాట్లాడుతూ బీచ్ఫెస్టివల్ అసభ్యకరంగా ఉండదని, ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. రోజా వివిధ సినిమాల్లో బికినీల్లో దర్శనమిచ్చారని, అటువంటి సీన్లు కూడా బీచ్పెస్టివల్లో ఉండవని, మహిళలు గర్వంగా ఫీలైయ్యేలా బీచ్ఫెస్టివల్ నిర్విహిస్తామని ఆయన చెప్పారు. మొత్తం మీద గతంలో అసెంబ్లీ సాక్షిగా దూషించుకున్న ఈ ఇద్దరు ఇప్పుడు మరోసారి బీచ్ఫెస్టివల్ సందర్భంగా తమ నోటికి పని చెప్పారు. మొత్తం మీద రోజా బికినీ గురించి కామెంట్స్ చేసిన బోండా మరోసారి వార్తల్లో నిలిచారు.