News and Entertainment

ఈ యాప్ ద్వారా ఇంటర్నెట్ లేకుండానే సినిమాలు చూడొచ్చు.. ఎలానో మీరే చూడండి..


టెక్నాలజీ పరంగా రోజురోజుకు ఎంతో అభివృద్ధి చెందుతున్నాం. ముఖ్యంగా విప్లవాత్మక స్మార్ట్ కమ్యూనికేషన్ టెక్నాలజీని ఎప్పటికప్పుడు ప్రపంచానికి పరిచయం చేస్తూ టెక్నాలజీ రారాజుగా అవతరించిన గూగుల్ తాజాగా, ఇండియన్ యూజర్స్ కోసం యూట్యూబ్ గో పేరుతో సరికొత్త యాప్ ను ఆవిష్కరించింది. లిమిటెడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీలో సైతం యూజర్ ఎక్స్ పీరియన్స్ ను మరింత మెరగుపరిచే లక్ష్యంతో అభివృద్థి చేయబడిన ఈ యాప్ ద్వారా 2జీ నెట్ వర్క్ లో కూడా వీడియోలను సేవ్ చేసుకొని స్మార్ట్ ఓఫ్ఫ్లిన్ ఫీచర్ ద్వారా వాటిని ఇంటర్నెట్ కనెక్షన్ తో పనిలేకుండా చూసుకోవచ్చు.

ఈ అప్లికేషను ఉపయోగించుకొని యూజర్లు 2జీ నెట్ వర్క్ లలో కూడా వీడియోలను సేవ్ చేసుకొని వాటిని ఆఫ్ లైన్ మోడ్ లో వీక్షించవచ్చు. ఈ సదుపాయం గతంలోనే అందుబాటులో ఉన్నప్పటికి మరిన్ని మాడిఫికేషన్స్ తో ఇప్పుడు లభ్యంకానుంది. ఆఫ్ లైన్ మోడ్ లో వీడియోలను వీక్షించేటపుడు వీడియోకు సంబంధించిన క్వాలిటీ కూడా అడ్జస్ట్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు.

యు ట్యూబ్ (ఆఫ్-లైన్)నెట్ లేకుండా చూసుకోవచ్చు :
యూట్యూబ్ గో యాప్ ద్వారా వీడియోలను సేవ్ చేసుకుని ఆఫ్ లైన్ మోడ్ లో వీక్షించటమే కాదు వాటిని లోకల్ షేర్ ఆప్షన్ ద్వారా మీకు సమీపంలోని యూజర్లకు షేర్ చేసుకోవచ్చు.

డేటాను పొదుపుగా వాడుకునే అవకాశం :

ఇండియన్ యూజర్ల డేటా బడ్జెట్ కు అనుగుణంగా డిజైన్ చేయబడిన యూట్యూబ్ గో యాప్ ద్వారా అందుబాటులో ఉన్న డేటా వనరులతోనే క్వాలిటీ వీడియో బ్రౌజింగ్ ను ఆస్వాదించే అవకాశం లభిస్తుంది. ఈ యాప్ ద్వారా మీరు ఏదైనా వీడియోను ఓపెన్ చేసినట్లయితే ఓ పాపప్ స్ర్కీన్ పై ప్రత్యక్షమవుతుంది. ఈ పాపప్ పై క్లిక్ చేయటం ద్వారా మీ నెట్ బ్యాలన్స్ కు సంబంధించిన వివరాలతో పాటు ఆ వీడియో ఫోన్ ఎస్డీకార్డ్ లో స్టోర్ చేసుకునే ఆప్షన్ కూడా కనిపిస్తుంది. డేటా లిమిట్ ను బట్టి ఆ వీడియోను డౌన్ లోడ్ చేసుకోవాలా వద్దా అనేది మీ నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుందట.