News and Entertainment

న‌వంబ‌ర్ 14 న ఆకాశంలో జరగనున్న అద్భుతం..ఇప్పుడు మిస్ అయితే నెక్ట్స్ 2034 లోనే.!


పోయిన నెల అంటే అక్టోబ‌ర్ 16వ తేదీన ఆకాశంలో చంద్రుడికి సంబంధించిన అద్భుతం ఒక‌టి జరిగింది గుర్తుందా..? అవును, అదే.. సూప‌ర్ బ్ల‌డ్ మూన్‌. చంద్రుడు మామూలు సైజ్ క‌న్నా కొంచెం పెద్ద‌గా క‌నిపించ‌డంతోపాటు ఎర్ర‌ని ఎరుపు రంగులో అంద‌రికీ క‌నిపించి క‌నువిందు చేశాడు. అయితే చంద్రుడికి సంబంధించిన అలాంటి మ‌రో అద్భుత‌మే ఈ నెల 14వ తేదీన జ‌ర‌గ‌నుంది. అదే సూప‌ర్ మూన్‌.

సూప‌ర్ మూన్ అంటే ఏం లేదు. చంద్రుడు త‌న అస‌లు సైజ్ క‌న్నా 14 శాతం పెద్ద‌గా క‌నిపిస్తాడ‌ట‌. అంతేకాదు 30 శాతం ఎక్కువ కాంతిని ప్ర‌కాశింప‌జేస్తాడ‌ట‌. ఈ నెల 14న చంద్రుడికి సంబంధించిన ఈ అద్భుతం జ‌ర‌గ‌నుండగా ఈ శ‌తాబ్దానికే ఇది అతి పెద్ద సూప‌ర్ మూన్ అని సైంటిస్టులు చెబుతున్నారు. మ‌ళ్లీ ఇలాంటి సూపర్ మూన్‌ను చూడాలంటే 2034 వ‌ర‌కు వేచి ఉండాల్సిందే. అయితే గ‌తంలోనూ సూప‌ర్ మూన్‌లు వ‌చ్చాయ‌ట కానీ అవి ఇంత పెద్దగా ఉండ‌లేద‌ట‌. అంతెందుకు, ఏడాదికి 4 నుంచి 6 సూప‌ర్ మూన్‌లు వ‌స్తూనే ఉంటాయ‌ట. అవి కూడా ఎక్కువ‌గా చ‌లికాలంలోనే మ‌న‌కు క‌నిపిస్తాయ‌ట‌. డిసెంబ‌ర్ నెల‌లో భూమి సూర్యునికి ద‌గ్గ‌ర‌గా జ‌రుగుతుంద‌ట‌. ఆ క్ర‌మంలో చంద్రుడు కూడా భూమికి ద‌గ్గ‌రగా వ‌స్తాడ‌ట‌. అందుకే సూప‌ర్ మూన్‌లు ఈ కాలంలో వ‌స్తాయ‌ట‌. సూప‌ర్ మూన్ వ‌చ్చిన‌ప్పుడు భూమికి, చంద్రునికి మ‌ధ్య దూరం దాదాపుగా 3,63,711 కి.మీ. ఉంటుంద‌ట‌. వారి మ‌ధ్య సాధార‌ణ దూరం 3,84,400 కిలోమీట‌ర్లు.



అయితే సూప‌ర్ మూన్ మాత్ర‌మే కాకుండా న‌వంబ‌ర్ నెల‌లో ఆకాశంలో మ‌రిన్ని అద్భుతాల‌ను మ‌నం వీక్షించేందుకు అవ‌కాశం ఉంద‌ని సైంటిస్టులు చెబుతున్నారు. అవేమిటంటే… రోజూ సూర్యాస్త‌మ‌యం కాగానే ఆకాశంలో గురుగ్ర‌హాన్ని చూడ‌వ‌చ్చ‌ట‌. అంతేకాకుండా ఈ నెల 23వ తేదీన శ‌ని, బుధ గ్ర‌హాల‌ను ప‌క్క ప‌క్క‌నే టెలిస్కోప్ స‌హాయంతో వీక్షించ‌వ‌చ్చ‌ట‌. 25న చంద్రుడి ప‌క్క‌న చేరిన గురు గ్ర‌హాన్ని చూడ‌వ‌చ్చ‌ట‌. 11, 17 తేదీల్లో ఉల్కాపాతం చోటు చేసుకుంటుంద‌ట‌. అయితే దీంతో మ‌న‌కు పెద్ద ప్ర‌మాదం ఉండ‌ద‌ని సైంటిస్టులు చెబుతున్నారు. ఇంకెందుకు ఆల‌స్యం మ‌రి, ఆయా తేదీల్లో ఆకాశంలో జ‌రిగే అద్బుతాల‌ను వీక్షించేందుకు సిద్ధంగా ఉండండి మరి..!