News and Entertainment

ఆ వీడియోలు ఎక్కువగా చూస్తే ఇంకేమి చెయ్యలేరు.. ఎందుకో తెలుసా..




ఎవరైనా మధ్యపానం ఆరోగ్యానికి హానికరం అన్నారు గానీ పోర్న్ వీడియోలు చూడటం హానికరం అనలేదే..! అనుకుంటే పొరపాటే. ఎందుకంటే చూసే కొద్ది బుర్రను తొలిచేస్తుందట. పోర్న్ చూడటమనేది చాలా మందికి తప్పించుకోలిని విషయం. ఏదో ఒక సమయంలో అందులో చిక్కుకోవాల్సి వస్తుంది. కొందరు దీనికి అతీతంగా ఉంటారు గానీ చాలా మందిని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. అంటే చూస్తున్న సమయానికి కిక్‌నిస్తుంది కానీ దీర్ఘ కాలంలో మైండ్ బ్లాంక్ చేస్తుందట. డైలీ మైల్ కధనం ప్రకారం ఇటీవల జేఏఎమ్ఏ సైకియాట్రి జరిపిన పరిశోధన పలు వివరాలను బయటపెట్టింది. అందులో ఆ చిత్రాలను చూసే వారికి భవిష్యత్తులో నిజంగా శృంగారంలో పాల్గొన్నప్పుడు ఆశక్తి ఉండదట.


భాగస్వామి ముందు అనవసర భంగపాటుకు గురికావాల్సి వస్తుందట. తరచూ నీలి చిత్రాలను చూసేవారు దాంపత్య జీవితంలో పూర్తి సంతోషాన్ని పొందలేరనేది పరిశోధన సంక్షిప్త సమాచారం. ఇది హార్మోన్లపై ప్రభావం చూపి వాటిని ఓవర్‌గా రెస్పాండ్ అయ్యే విధంగా తయారు చేసే ప్రమాదం కూడా ఉందట. అతి సమస్తం అనర్ధదాయకం అని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. ఈ విషయంలో కూడా అది తప్పకుండా వర్తిస్తుంది. కాబట్టి పరిశోధకలు చెప్పే సూచన ప్రకారం పోర్న్ చిత్రాలు చూడటాన్ని వ్యసనంగా మారకుండా చూసుకోవాల్సిన బాధ్యత వహించాల్సిందే మరి..
Also Read: