News and Entertainment

అసలు కామం అంటే ఏంటి?కామం అనగానే మనకు తెలిసిన అర్థం వేరు. మనకు స్ఫురణకు వచ్చే దృశ్యం వేరు. మనస్సుకీ, కామానికీ దగ్గరి సంబంధం ఉంది. కామానికీ, దేహానికీ అలాంటి సంబంధమే ఉంది. ఇదో ట్రయాంగిల్‌ వ్యవహారం. అంటే త్రికోణం. త్రికోణం అనగానే కాముకులకు దేహంలోని సుడిగుండం వంటి ప్రదేశంలో మనసు చిక్కుబడిపోతుంది. మామూలు అర్థంలో మనస్సు నుంచి దేహానికి ప్రసారం అయ్యేదే కామం. మనసే అన్నింటికీ ప్రధానం కనుకే మనసులో పుట్టిందే కామం అన్నారు. మనస్సులో పుట్టకుండా దేహంలో చలనం రాదు మరి. మన్మథుడికి ఇంకో పేరు కాముడు. అతనికి మనసిజుడు అనే పేరుంది. అంటే మనసు నుంచి పుట్టినివాడని అర్థం.

ఈ విషయాలనే వాత్స్యాయనుడు కాస్త పాలిష్‌డ్‌గా చెప్పాడు. అంతరార్థాలను విడమరిచారు. ఆత్మ అంటే జీవుడు. ఆ జీవాత్మలో లీనమై ఉన్నదే మనస్సు. మానవ దేహంలోని ప్రతి అవయవం మనస్సు ఆదేశాల మేరకే పని చేస్తుంది. చర్మంతో సహా అవయవాలన్నీ ఇలా మనస్సు చెప్పింది చెప్పినట్టు తమ ధర్మాలను నిర్వర్తించడమే కామం అంటాడు వాత్స్యాయనుడు. అతడు ఏ ఒక్క అవయవానికో కామాన్ని పరిమితం చేయకపోవడం గుర్తించాలి. ఇంద్రియాల ద్వారా పలు విధాలైన ఫీలింగ్స్‌ని అనుభవిస్తున్నప్పుడు జీవాత్మకు సుఖం, ఆనందం కలుగుతుంటాయి. ఆ సుఖం, ఆనందమే కామమని అతడి లెక్క.

పైన చెప్పిందంతా సాధారణ కామం. ఇది కాకుండా విశేష కామం అని ఒకటి ఉంది. అది రతి సమయంలో స్త్రీ పురుషుల మధ్య స్వర్శ కారణంగా సంభవించేది. ఇలాంటి కామం కోసమే యువతీ యువకులు మనస్సులో తపించిపోతుంటారు. రతి సమయంలో తమకంతో ఉన్న స్త్రీ దేహం సర్వ విధాలా విచ్చుకుంటుంది. సాధారణ స్థితి కంటే మరింత మృదువుగా, సున్నితంగా రూపాంతరం చెందుతుంది.