News and Entertainment

జియో సిమ్ తీసుకున్న వారి భవిష్యత్తు చివరికి ఇదేనా..??



రిలయన్స్ జియో సంచలనం అంతా మాటలకే పరిమితమైందా? దేశం మొత్తం ప్రచారం అయింది వేరు.. జియో నెట్ వర్క్ వాడుతున్న వాళ్ల ఎక్స్ పీరియన్స్ వేరుగా ఉందా? అవును జియో సిమ్ లు తీసుకున్నవారు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారట. రిలయన్స్ జియో నెట్ వర్క్ టెలికాం రంగంలో సంచలనం సృష్టిస్తూ సేవలు ప్రారంభించి 3నెలలు గడిచిపోయింది.

దీనిపై ప్రముఖ బ్రోకరేజ్ సంస్త మోతీలాల్ ఓస్వాల్ ఓ నివేధిక రూపొందించింది. ఆ నివేధిక కష్టమర్ల కష్టాలను ఆసాంతం వెల్లడిచేసింది. కొత్త కస్టమర్లు వచ్చి చేరినా కొద్ది నెట్ స్పీడ్ దారుణంగా పడిపోయిందని తెలిపింది. నెట్ వర్క్ క్వాలిటీ కూడా తగ్గిపోయిందని పేర్కొంది. ఇప్పుడంటే ఫ్రీ ఆఫర్ మీద నెట్టుకొస్తోంది గాని ఛార్జీలు వసూలు చేయడం ప్రారంభిస్తే జియోపై జనాలకు ఉన్న మోజు మొత్తం ఉష్ కాకేనన్న సంగతి వెల్లడవుతుందని తెలిపింది.


వెల్‌కమ్ ఆఫర్ ముగిసిన తర్వాత చాలా మంది సబ్‌స్క్రైబర్లు జియోను స్టాండ్ బై (సెకండ్ సిమ్‌గా)నే వాడతారని సర్వే చెప్పింది. రీఛార్జ్ చేసుకొమ్మన్నప్పటి నుంచి సిమ్ హోల్డర్లంతా పక్కన పడేస్తారని అంటోంది నివేదిక. రిలయన్స్ జియోకి భారతీ ఎయిర్ టెల్ ప్రధాన పోటీదారుగా నిలుస్తోంది. ప్రస్తుతం అటు నెట్‌వర్క్‌లో గానీ, ఇటు డేటా సేవల్లో గానీ జియోకి కేవలం ఎయిర్ టెల్ మాత్రమే గట్టిపోటినిస్తోందని అభిప్రాయపడింది. ఇతర టెలికం కంపెనీలు జియో పోటీని తట్టుకోవాలంటే ఏడాదిన్నర సమయం పడుతుందని అంచనా వేసింది.


మోతీలాల్ ఓస్వాల్ నివేదిక ప్రకారం యూజర్ల నుంచి వ్యక్తమౌతోన్న సమస్యల పరిష్కారానికి జియో వచ్చే రోజుల్లో మరిన్ని పెట్టుబడులు పెట్టనుందట. నెట్‌వర్క్‌ను బలోపేతం చేసుకోవడం, డిజిటల్ సేవల విస్తరణ వంటి వాటికి ఈ నిధులను ఉపయోగించుకుంటుందని తెలిపింది. కాగా కంపెనీ లాభాలను గడించాలంటే కనీసం 8-10 ఏళ్ల సమయం పడుతుందని పేర్కొంది.