News and Entertainment

అబ్బాయిలు ఇలా చేస్తే.., అమ్మాయిలు తెగ బాధపడతారంట.. ఇది చదివి జాగ్రత్త పడండి



ఒక అబ్బాయి ముగ్గరు అమ్మాయిలను పడేసాడు అనుకోండి .. మగ,ఆడ అనే తేడా లేకుండా అంతా ఏమనుకుంటారు ? కుర్రోడికి స్పీడ్ ఎక్కువ, మన్మధుడు, లవర్ బాయ్, మగమహారాజు అంటూ రకరకాలుగా పొగుడుతారు.
కాని అదే పని అమ్మాయి చేస్తే, అమ్మాయి ఓ ముగ్గురు మగవారిని వల్లో పడేస్తే? ఇప్పుడు ఆడ, మగ అనే తేడా లేకుండా అందరు నోటికొచ్చింది తిట్టేస్తారు. అమ్మాయికి క్యారెక్టర్ లేదని తేల్చేస్తారు. సమాజంలో ఉన్న అసమానతల ప్రభావం చాలామంది అబ్బాయిలపై పడుతోంది.
ఒకమ్మాయిని పడేయాలన్నా, ఇష్టమైన అమ్మాయిని ముందు గొప్పలు చెప్పుకోవాలన్నా, చాలామంది అబ్బాయిలు చేసే పని, తమకు పడిపోయిన అమ్మాయిల గురించి చెప్పడం. ఆ గల్లిలో ఈ అమ్మాయి, ఇంటిముందు ఈ అమ్మాయి, క్లాస్ లో ఆ అమ్మాయి అంటూ, తమని తాము ఒక ప్లే బాయ్ లాగా ప్రోజెక్టు చేసుకుంటారు చాలామంది అబ్బాయిలు. ఇలా చేస్తే అమ్మాయి తమ గురించి గొప్పగా ఫీల్ అవుతుందేమో అని వారి ప్లాన్. కాని ఇది చాలా చెత్త ఐడియా.

ఏ అమ్మాయి అయినా, తనను మాత్రమే పట్టించుకునే అబ్బాయిని ఇష్టపడుతుంది. ఇలా మిగితా అమ్మాయిల విషయాలు ఇష్టమైన అమ్మాయి ముందు చర్చిస్తే, తనకు మీ మీద నెగెటివ్ ఇంప్రెషన్‌ పెరిగే ప్రమాదం ఉంది. ప్రపంచం మొత్తం, లవర్ బాయ్ అంటూ మిమ్మల్ని పొగడొచ్చు .. కాని మిమ్మల్ని కోరుకునే అమ్మాయికి మాత్రం చాలా బాధకరమైన విషయం ఇది.
ఇంతేసి అమ్మాయిల్ని పడేసాను అనే మీ గొప్పలు మీ మీద క్రమంగా నమ్మకం తగ్గించి, అనుమానం పెంచుతాయి. అందుకే మనసు, మాట .. మొత్తం ఒక్క అమ్మాయి మీదే పెట్టండి.