News and Entertainment

2016 టాలీవుడ్ రివ్యూ: మన హీరోల హిట్స్& ఫ్లాప్స్


2016 సంవత్సరంలో విడుదలైన తెలుగు హీరోల హిట్స్ అండ్ ఫ్లాప్స్ గురించి క్లుప్తంగా చూస్తే..

నందమూరి బాలకృష్ణ:

సంక్రాంతి బరిలో డిక్టేటర్‌గా వచ్చిన బాలకృష్ణ సంతృప్తికరమైన విజయాన్ని అందుకున్నారు. ఆయన కొత్తతరం దర్శకులతో పనిచేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఒకవైపు తన బ్రాండ్‌ ఇమేజ్‌ నిలబెట్టుకుంటూనే గౌతమిపుత్ర… వంటి సినిమా చేస్తున్నారు.

మహేష్‌బాబు:

మహేష్‌కు 2016 కొంత నిరుత్సాహాన్ని మిగిల్చింది. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన బ్రహ్మోత్సవం బాక్సాఫీస్‌ వద్ద నిలబడలేకపోయింది. ఇలాంటి కథని ఆయన ఎలా అంగీకరించారని అభిమానులు సైతం విస్మయం వ్యక్తం చేశారు. అంతకు ముందు ఏడాది శ్రీమంతుడు సినిమాతో ఆయన భారీ విజయాన్ని అందుకున్నారు. టాలీవుడ్‌ చరిత్రలో 150 కోట్లు వసూలు చేసిన సినిమా హీరోగా క్రెడిట్‌ దక్కించుకున్నారు.