News and Entertainment

జియోకి దిమ్మతిరిగేలా ఎయిర్‌టెల్ మరో బంపర్ ఆఫర్


ప్రీపెయిడ్‌ కస్టమర్లకు భారీగా ఆఫర్లు ప్రకటించిన ఎయిర్‌టెల్‌ ఇప్పుడు పోస్ట్‌పెయిడ్‌ కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ తరుణంలో రెండు ఆఫర్లను ప్రకటించింది. రూ.549ప్లాన్‌లో ఉన్న కస్టమర్లకు ఏ నెట్‌వర్క్‌కైనా లోకల్‌ అండ్‌ ఎస్టీడీ అపరిమిత కాలింగ్‌, రోమింగ్‌లో ఇన్‌కమింగ్‌, వింక్‌ మ్యూజిక్‌, వింక్‌ మూవీస్‌కి నెలసరి సబ్‌స్క్రిప్షన్‌ ఉచితంగా అందించనుంది.

రోజుకి 100 ఎస్‌ఎంఎస్‌లు, 3జీ హ్యాండ్‌ సెట్‌ ఉన్న వారికి 1జీబీ, 4జీ హ్యాండ్‌ సెట్‌ ఉన్న వినియోగదారులకు 3జీబీ డేటాను ఉచితంగా ఇవ్వనున్నట్ల తెలిపింది. రూ.799 ప్లాన్‌లో ఉన్న వారికి రూ.549 ప్లాన్‌లో ఉన్న ఆఫర్లనే వర్తింపు చేస్తూ 4జీ హ్యాండ్‌సెట్‌ ఉన్నవారికి 5జీబీ డేటా, 3జీ హ్యాండ్‌ సెట్‌ ఉన్న వారికి 3జీబీ డేటా అదనంగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. వీటితో పాటుగా రూ.1,199 ప్యాక్‌ని కూడా కంపెనీ అప్‌గ్రేడ్‌ చేసి కొన్ని ప్రత్యేక ఆఫర్లను అందులో అదనంగా ఇచ్చింది.