News and Entertainment

అమ్మ మరణం గురించి చెప్తాం.... దేశం మొత్తం అల్లకల్లోలం అవుతుంది


ఇప్పటికే దేశం లో వివిధ రకాల ఎకౌంటు లని హ్యాక్ చేసి పక్కా సమాచారాన్ని ప్రపంచానికి చేర వేస్తున్న లీజియన్ గ్రూప్ ఇప్పుడు మరొక పెను సంచలనానికి దారి తీస్తోంది. అపోలో ఆసుపత్రి సర్వర్ లకి సంబంధించిన సమాచారం మొత్తం తమదగ్గర ఉంది అనీ జయలలిత చావు నిజాలు అన్నీ తమకి తెలుసు అనీ ఈ సంస్థ సంచలనం రేపుతోంది.
భారతీయ ప్రముఖ రాజకీయ నాయకుల డేటా కూడా ఉందంటున్నారు వీరు. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత 75 రోజుల చికిత్స తర్వాత తుదిశ్వాస విడిచిన నేపథ్యంలో లీజియన్ గ్రూపు ప్రకటన సంచలనం సృష్టిస్తోంది.

‘అమ్మ’ చివరి క్షణంలో అపోలో కేంద్రంగా రాజకీయాలు నడిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో లీజియన్ ప్రకటన తీవ్ర సంచలనమైంది. భారత సర్వర్ల నుంచి క్రోడీకరించిన సమాచారంలో భారత ప్రముఖులకు సంబంధించిన డేటా తమ వద్ద ఉందని లీజియన్ వివరించింది.


భారత్‌లోని ప్రముఖుల ట్విట్టర్ ఖాతాలను హ్యాక్ చేస్తున్న లీజియన్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, పారిశ్రామిక వేత్త విజయ్‌మాల్యా, జర్నలిస్టు బర్ఖాదత్, రవిష్ కుమార్ వంటి వారి ట్విట్టర్ ఖాతాలను హ్యాక్ చేసింది.
కాగా తమ తదుపరి లక్ష్యం ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ అని చెప్పిన లీజియన్ ప్రతినిధి అక్రమార్కుల వివరాలిస్తే మరిన్ని హ్యాక్‌లు చేస్తామని వెల్లడించింది.