News and Entertainment

బ్రేకింగ్ న్యూస్: యాంకర్ రశ్మి కిడ్నాప్.. కారు డ్రైవర్ రూటు మార్చి


ప్రముఖ టీవీ షో 'జబర్తస్'‌తో పాపులర్ అయిన యువ నటి రశ్మి. తొలుత సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ తర్వాత టీవీ యాంకర్‌గా ప్రసిద్ధి చెందింది. ఇక ‘జబర్దస్త్’ షో‌కి ఇంతకుముందు అనసూయ యాంకర్‌గా చేసేది. అయితే ఇటీవల ఆ స్థానంలో రశ్మి కంటిన్యూ చేస్తుంది. ఇక ఈ ప్రోగ్రామ్‌కి హోస్ట్‌గా వర్క్ చేస్తూనే సినిమాల్లో కూడా నటిస్తోంది రశ్మి. దీనితో ఒక్కసారిగా రష్మికి పాపులారిటీ పెరిగిపోయింది. చాలా చోట్ల జరిగే కార్యక్రమాలకు రేష్మి ని ముఖ్య అతిధి గా పిలుస్తున్నారు. అలాగే కర్నూలు జిల్లా నంద్యాలలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ముఖ్య అతిధిగా రావాలని కోరడంతో అందుకు ఆమె ఒప్పుకుంది. ఆ ప్రోగ్రం కోసం హైదరాబాద్ నుండి నంద్యాల కి తనతో పాటు తన కారు డ్రైవర్ ని తీసుకొని బయలుదేరింది. కాని కారు లో వెళ్ళడమే ఇక్కడ రశ్మి చేసిన తప్పు.

హైదరాబాద్ నుండి కొంత దూరం ప్రయాణించాక మధ్యలో కారు టైర్ పంచర్ అవ్వడంతో బాగా లేటయింది. అప్పటికే చీకటి పడడంతో కారు డ్రైవర్ కారును రూటు మళ్ళించాడు. రశ్మి ఒక్కసారిగా భయానికి గురైంది. తనను కిడ్నాప్ చేసాడని కంగారు పడి సన్నిహితులకు ఫోన్ చేసి సమాచారం అందించింది. కాని చివరికి కారు డ్రైవర్ రోడ్డు మార్గం తెలియక పోవడంతో ఈ పొరపాటు జరిగినట్లు తెలుస్తుంది. అయితే.. చివరికి ఎదో విధంగా నంద్యాలలో జరుగుతున్న కార్యక్రమానికి ఆలస్యంగా రష్మీ చేరుకుంది. దీనితో అక్కడి ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పిన రష్మీ, జరిగిన విషయం ఇదీ అని చెప్పింది.