News and Entertainment

ఏపి పర్స్ పేరుతొ ప్రజల్ని మోసం చేస్తున్న ప్రభుత్వం ..బయటపడ్డ నిజం...!


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పెద్దనోట్ల రద్దు నేపధ్యంలో డిజిటల్ లావాదేవీల కోసం ఎపి పర్స్ అనే కొత్త యాప్ ను అట్టహాసంగా ఆవిష్కరించిన విషయం విదితమే. ఈ యాప్ ను ఇన్స్టాల్ చేయడానికి ఒక రిఫరల్ కోడ్ అవసరమవుతుంది. మీకు వచ్చిన కోడ్ ను రిఫరల్ కోడ్ గా ఇచ్చినట్టయితే మీరు రూ 60 వరకు సంపాదించుకోవచ్చు అని తెలియజేసారు. ఈ క్రమంలో మీరు నెలకు రూ 5000 నుంచి రూ 20000 వరకు సంపాదించుకోవచ్చని ఊదరగొట్టారు. అయితే వాస్తవ పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ఈ రిఫరల్ కోడ్ 7 అంకెలతో మనకు వస్తుంది. కాని వేరే వాళ్లకు ఈ యాప్ ను ఇన్స్టాల్ చేసినప్పుడు 6 అంకెలను మాత్రమే  అంగీకరించడంతో అయోమయంలో పడ్డారు వినియోగదారులు.


ఇదంతా బూటకమేనని కేవలం ప్రచారం కోసం ఇలా ప్రకటించారని పలువురు తమ ఆక్రోశాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ యాప్ ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు వచ్చే డబ్బు అంతా ప్రభుత ఖాతాల్లోకే వెళ్తుంది తప్ప ప్రజల ఖాతాల్లోకి రావడం లేదని దీన్ని బట్టి తెలుస్తోంది. ఈ విధంగా రాష్త్ర ప్రభుత్వం ప్రజల్ని మభ్యపెడుతుందనీ ఈ ఎపి పర్స్ యాప్ వలన సంపాదన అంతా ఉత్తిదే అనే నిజం బయటపడింది. అయితే దీనికి సంబందించిన ప్రతినిధులను ఎప్పుడు సంప్రదించినా మరో వారం రోజుల్లో ఈ యాప్ అప్ డేట్ అవుతుందని సన్నాయినొక్కులు నొక్కుతున్నారు. మరి ఇది ఎప్పుడు అప్ డేట్ అవుతుందో అసలు అవుతుందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది.