News and Entertainment

బంపర్ ఆఫర్...బీరు 2 రూపాయలు మాత్రమే...!ఏంటి... బీర్ 2 రూపాయలా.. అని ఆశ్చర్యపోతున్నారా..ఇది నిజం. 100 రూపాయల కంటే తక్కువ ధరకు దొరకని బీరు కేవలం రూ 2 కే దొరుకుతుంది. విస్కీ కూడా కేవలం రూ 49 కే లభిస్తుంది. మందుబాబులకు నోరూరిస్తున్న ఈ ఆఫర్ అందరికీ కాదు. కేవలం ముంబై వాసులకు మాత్రమే. ముంబయి లో ఓ పబ్ మందు బాబులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. జుహు, లోయర్ పెరల్‌ లో ఉన్న మిస్టర్ బోజీ బీరు కేవలం రూ.2 లకు మాత్రమే ఇస్తున్నారు. అలానే విస్కీ కూడా రూ.49 లకే లభిస్తుందట.డిసెంబర్ 4 నుంచి 8 వరకు ఈ ఆఫర్ ను అందుబాటులోకి తెస్తోంది సదరు పబ్. తక్కువ మొత్తంలో ఎక్కువ తాగండి అంటూ బోర్డు పెట్టి మరీ ఆహ్వానం పలుకుతోంది. నోట్ల రద్దు నేపధ్యంలో రోజూ బ్యాంకుల ముందు ఏటిఎం ల ముందు క్యూలు కట్టిన ప్రజలకు ఈ ఆఫర్ బాగా నచ్చి డిసెంబర్ 4 ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నారట.. ఈ క్రమంలో ఈ నాలుగు రోజులు ఏటిఎం లు బ్యాంకులు కంటే ఎక్కువమంది బీరు కోసం బారులు తీరడం ఖాయం.