News and Entertainment

ఆమ్లెట్ తో బరువు తగ్గుతారని మీకు తెలుసా?


సాధారణంగా మనం ఎవరైనా సరే టిఫిన్ మధ్యానం భోజనం బాగానే తింటాం కానీ సాయంత్రం చిరుతిండ్లు మాత్రం నోరు ఆపుకోలేము మరి లావు అవుతాము అన్న భయం లేదా అంటే…ఉంటుంది కాని సన్నపడి అదే సమయంలో పోశాకలతోపాటు రుచికరంగా కూడా ఉండాలి కదా మరి ఏమి తినాలి అంటే ఇదిగోండి ఇది మీకోసమే

-తక్కువ టైమ్‌లోనే తయారు చేసుకునే స్నాక్స్‌ అయ్యుండాలి. కాబట్టి టొమాటోలు గుడ్డులోని తెల్లసొనలతో కలిపి చక్కటి ఆమ్లెట్‌ వేసుకోండి. తక్కువ క్యాలరీలతో ఎక్కువ శక్తినిచ్చే స్నాక్‌ ఇది.


– లేత పుదీనా ఆకులను ఎగ్‌వైట్‌లోకి వేసి.. బాగా కలియబెట్టి.. కాస్త ఉప్పు, కారం జోడించి.. ఆమ్లెట్‌ వేసుకోవచ్చు. ఇందులోను చాలా తక్కువ క్యాలరీస్‌ ఉంటాయి.
– ఎగ్‌వైట్‌లోకి ఉడికించిన పచ్చి బటానీలు, క్యారెట్‌ వంటి కూరగాయల ముక్కలు కలిపి వేసుకోవచ్చు.
– మార్కెట్‌లో సులువుగా దొరికే ఆకుకూర పాలకూర. దీన్ని సన్నగా తరిగి.. ఎగ్‌వైట్‌లో కలుపుకుని ఆమ్లెట్‌ వేసుకోవచ్చు.
– ఒట్టి ఆమ్లెట్‌ వేసుకుని తింటే ఆకలితీరదు. రెండు మూడు బ్రెడ్‌ ముక్కల్ని పల్చగా వేడిచేసి.. ఎగ్‌వైట్‌తో బ్రెడ్‌ ఆమ్లెట్‌ వేసుకోండి.
– నూనెలేకుండా దోస వేసి.. దాని మీద ఎగ్‌వైట్‌ వేసుకోవచ్చు. ఇది ఇన్‌స్టంట్‌ ఎనర్జీ.
– తక్కువ నూనెతో ఎగ్‌పరాటాను వేసుకోవచ్చు. అయితే మసాలాలు దట్టించకూడదు. కేవలం ఎగ్‌వైట్‌నే తీసుకోవాలి.