News and Entertainment

షాకింగ్...కొత్త నోట్ల కుంభకోణంలో అడ్డంగా దొరికిన ముఖ్యమంత్రి....ఆ మొత్తం ఎంతో తెలిస్తే షాక్ అవుతారు...!నోట్ల రద్దు నేపధ్యంలో సామాన్య ప్రజానీకం బ్యాంకులు, ఏటిఎం ల చుట్టూ తిరుగుతున్నప్పటికీ సరైనంత డబ్బు లభించడం లేదు. కాని ప్రభుత్వాధికారులు మాత్రం కొత్తగా ముద్రించిన కోట్ల రూపాయలను తమ ఇంట్లో దాచిపెట్టుకొని హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆదాయ పన్ను శాఖ అధికారులు పలు బృందాలుగా విడిపోయి బెంగళూరు, చెన్నై, ఈరోడ్ తదితర ప్రాంతాల్లో తెల్లవారు జామున నుంచి దాడులు మొదలు పెట్టారు. కర్ణాటక ముఖ్యమంత్రికి అత్యంత ఆప్తుడైన కావేరీ జలమండలి చీఫ్ ఇంజనీరు చిక్కరామయ్య, జాతీయ రహదారుల అభివృద్ది మండలి మేనేజింగ్ డైరెక్టర్ జయచంద్ర (బెంగళూరు) ఇళ్ళు , నివాసాల్లో సోదాలు చేశారు.


ఇదే విధంగా మరో ఇద్దరు కాంట్రాక్టర్ల నివాసాలను సోదా చేస్తే  వారి వద్ద ఏకంగా రూ 6 కోట్లు బయట పడ్డాయి. అందులో రిజర్వు బ్యాంకు ఇటీవల ముద్రించిన కొత్త రెండు వేల రూపాయల నోట్లు రూ. 4.70 కోట్లు అంటే రూ. 2,000 నోట్ల 235 కట్టలు బయటపడటంతో అధికారులు హడలిపోయారు.  అంతేకాకుండా దాదాపు 7 కిలోల బంగారు బిస్కెట్లు, నగలు,పలు ఆస్తుల డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు సీఎం సిద్దరామయ్య ఎలా స్పంధిస్తారు అని కర్ణాటక బీజేపీ నాయకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బ్యాంకు అధికారుల సహకారం లేకుండా ఇంత పెద్ద మొత్తంలో నగదు బయటకు రావడం సాధ్యం కాదని, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కొన్ని బ్యాంకుల మీద తాము నిఘా వేశాయని అధికారులు చెప్పారు.