News and Entertainment

వ‌ణుకుపుట్టిస్తున్న‌ గ్యాంగ్‌ రేప్‌.. వీళ్ళు మ‌నుషులు కాదు..రాక్ష‌సులు.!


రాను రానూ మ‌గ‌వారి పైశాచిక‌త్వం హ‌ద్దులు దాటుతుంది. ఏ పాపం తెలియ‌ని అమాయ‌క‌పు ఆడ‌వారిపై జంతువ‌ల కంటే దారుణంగా తెగ‌బ‌డుతూ వారి జీవితాల‌ను నాశ‌నం చేస్తున్నారు. జ‌రిగే సంఘ‌ట‌న‌ల‌ను చూసి సినిమాలు తీస్తున్నారో లేక సినిమాలు చూసి జ‌నం చెడిపోతున్నారో తెలియ‌దు కానీ, అచ్చం మ‌నం చూసిన సినిమాల‌ను త‌ల‌పించే విధంగా అత్యాచారాల‌కు పాల్ప‌డుతున్నారు.

గ‌తంలో వచ్చిన టెంప‌ర్ మూవీలో క‌నిపించిన రేప్ సీన్ ఎంత మందిని క‌న్నీటి ప‌ర్యంతం చేసిందో తెలియ‌నిది కాదు. ఓ యువ‌తిని అత్యంత క్రూరంగా హింసించిన ఆ సీన్ చూసి ఎంతో మంది యువ‌త చెలించిపోయారు. అయితే కొంద‌రు యువ‌కులు మాత్రం ఓ అమాయ‌క‌పు ఆడ‌పిల్ల‌ను అదే విధంగా చిత్ర‌హింస‌లు గురిచేసిన సంఘ‌ట‌న ఢిల్లీలో వెలుగుచూసింది.జామియా నగర్ కు చెందిన సాజిద్ ఖాన్ (40) అనే బిల్డర్ ఈ యేడాది జూలైలో 15 ఏళ్ల బాలికను అత్యంత రాక్ష‌సంగా అత్యాచారం చేశాడు. అంత‌టితో వ‌ద‌ల‌కుండా మ‌రో ముగ్గురు యువ‌కుల‌తో క‌లిసి ఆ బాలిక‌పై నెల‌ల త‌ర‌బ‌డి అత్యాచారం జ‌రిపాడు. వివ‌రాల్లోకి వెళితే, పొట్ట‌కూటి కోసం ఇళ్ల‌లో ప‌నిచేసుకుంటూ జీవ‌నం సాగించే ఓ మ‌హిళ‌కు 15 ఏళ్ల కూతురు ఉంది. ఆ మైన‌ర్ బాలిక‌పై క‌న్నేసిన సాజిద్ ఖాన్‌(40) ఆమెను షహీన్ బాగ్ ప్రాంతంలోని ఓ ఫ్లాట్ కు తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. త‌ర్వాత ఆమె న‌గ్న ఫోటోలు, వీడియోలు తీసి బెదిరించాడు. చెప్పిన‌ట్లు విన‌క‌పోతే వీటిని ప్ర‌పంచానికి చూపిస్తాన‌ని బెదిరించాడు. బిల్డ‌ర్ బెదిరింపుల‌కు భ‌య‌ప‌డిన యువ‌తి కొన్ని నెల‌ల‌పాటు అత‌నిచేతిలో ఆట‌బొమ్మ‌గా మారింది.



ఆ త‌ర్వాత మరో ముగ్గురు ముసుగులు ధరించిన సహచరులను తీసుకువెళ్లి వారితో దక్షిణ ఢిల్లీలోని వివిధ ఫ్లాట్లలోకి బాలికను తీసుకువెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. సున్నిత ప్ర‌దేశాల్లో సూదుల‌తో గుచ్చ‌డం, సిగ‌రెట్స్‌తో కాల్చ‌టం వీరి పైశాచిక‌త్వానికి నిద‌ర్శ‌నంగా మారింది. వారి పైశాచిక‌త్వం తీవ్ర‌రూపం దాల్చ‌టంతో బెదిరిపోయి త‌ప్పించుకోటానికి ప్ర‌య‌త్నించిన యువ‌తిని తాళ్ల‌తో క‌ట్టేసి చావ‌బాదారు. త‌మ‌కు తోచిన భంగిమ‌ల్లో అభ్యంత‌క‌ర‌మైన రీతిలో రేప్ చేశారు. ఫ‌లితంగా యువ‌తి గ‌ర్భం దాల్చింది. విష‌యం త‌ల్లికి తెలిసింది. అయితే క‌డుపు తీయించుకోక‌పోతే త‌న‌ని, త‌న కూతుర్ని చంపేస్తామ‌ని బెదిరించారు.గ్యాంగ్ రేప్ కేసులో ప్రధాన నిందితుడైన ఖాన్ కు వివాహమై నలుగురు పిల్లలున్నారని పోలీసులు చెప్పారు.అయితే కొంద‌రు పెద్ద‌ల స‌హాయంతో యువ‌తి తల్లి విష‌యాన్ని పోలీసుల వ‌ర‌కూ తీసుకువెళ్లింది పోలీసులు కేసు నమోదు చేసి నలుగురు నిందితుల కోసం గాలిస్తున్నారు.