News and Entertainment

చికెన్ లో ఈ భాగాలను అస్సలు తినొద్దు.. కారణం ఏంటో తప్పక తెలుసుకోండి



ముక్కలేకుండా ముద్ద దిగదు చాలా మందికి.. అటువంటి వారు ఈ విషయం కనుక తెలుసుకోకుంటే మీ ఆరోగ్యాన్ని తీవ్రమైన ప్రమాదంలో పెట్టినట్టే మరి.. తక్కువ సమయంలో కోడిని అమాంతం పెంచేసి ఇబ్బడి ముబ్బడిగా లాభాలు గడించేందుకు ఇటీవలి కాలంలో కోళ్లకు ఇంజక్షన్లు వేయడం తెలిసిందే. కోడి బరువు పెరుగుదల ఏమోగాని ఈ క్రమంలో వాడే స్టెరాయిడ్స్ మన ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. అప్పటికప్పుడు దాని పరిణామాలు తెలియకపోయినా దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. కోడి బరువు పెరుగుదలకు స్టెరాయిడ్స్ మెడమీద, రెక్కలకు మాత్రమే ఇస్తుంటారు. కోడి మిగిలిన శరీర భాగాలకంటే ఈ రెండు పార్టులపై మాత్రం ప్రభావం అత్యంత ప్రమాదకరంగా ఉంటుంది. అందుకే దీనిపై తీవ్రంగా పరిశీలన జరిపిన నిపుణులు కనీసం ఆ రెండు పార్టులనైనా తినడం మానుకోమని సలహా ఇస్తున్నారు. స్టెరాయిడ్ ప్రభావం తీవ్రంగా ఉండే చికెన్ తింటే కలిగే నష్టాలివే..


* శరీర ధర్మాలను క్రమబద్ధంచేసే హార్మోన్ల విడుదలలో తేడాలొస్తాయి. ఈ అసహజమైన క్రియ ఎన్నో అనారోగ్యాలకు హేతువవుతుంది.
* ఛాతిని అనారోగ్యానికి గురిచేసే సూక్ష్మక్రిములు పెరుగాయి. అవి ఒక్కోసారి క్యాన్సర్ కారకాలుగానూ పరిణమించొచ్చు.
* కడుపులో కణుతులు పెరుగుతాయి. ఇవీ కొన్నిసార్లు క్యాన్సర్లుగా మారే ప్రమాదం ఉంది.
* ఆడవాళ్లకు గర్భాశయ సమస్యలు వస్తాయి.
ఇంజక్షన్ల ప్రభావం తీవ్రంగా ఉండే కోడి మెడ, రెక్కల భాగాలను తినేవారికి దీర్ఘకాలంలో ఈ సమస్యలు అనివార్యం. మరి ఇంత తెలిసినా చికెన్ ప్రియులు ఇప్పటికిప్పుడు తినడం మానుకోవడం సాధ్యమయ్యే పనికాదు.. అలాగని బాయిలర్ కోడికి బదులుగా నాటు కోడిని తిందామన్నా అందుబాటులో ఉండదు. అందుకే ఆ రెండు పార్టులని మానుకోమని సలహా. ఈ
విషయం అందరికీ తెలిసేలా షేర్ చేయండి