News and Entertainment

బ్రేకింగ్ న్యూస్: పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు..


ప్రముఖ హీరో, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌పై ఆదివారం హైద‌రాబాద్‌లో ఎఫ్ఐఆర్ న‌మోదైంది. కొద్ది రోజుల క్రితం సుప్రీంకోర్టు సినిమాహాళ్ల‌లో త‌ప్ప‌నిస‌రిగా జాతీయ‌గీతం ప్ర‌ద‌ర్శించాల‌ని చెప్పింది. దీనిపై ప‌వ‌న్ త‌న సోష‌ల్ మీడియాలో వ్య‌గ్యంగా స్పందించిన సంగ‌తి తెలిసిందే.
సినిమా హాళ్లు దేశభక్తిని నిరూపించుకునేందుకు పరీక్ష కేంద్రాలుగా మారాయని పవన్ చేసిన ట్విట్‌పై హైకోర్టు న్యాయవాది జనార్థన్ గౌడ్ ఫిర్యాదు చేశారు. పవన్ జాతీయ గీతానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నారని..

జనార్థన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
సుప్రీం కోర్టు తీర్పును తన ట్విట్టర్‌ ఖాతాలో పవన్‌ అవమానించినట్లు జనార్థన్ చెప్పారు. దేశ ప్రజల్లో జాతీయగీత వ్యతిరేక ప్రచారం చేస్తూ రెచ్చగొడుతున్నారని, దేశ వ్యతిరేక చర్యలకు పవన్‌ పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు.