News and Entertainment

లవ్ మ్యారేజ్ అయినా ఎరేంజ్ మ్యారేజ్ అయినా కొత్త పెళ్ళికూతురితో అలా ప్రవర్తించకూడదు

ప్రేమ పెళ్ళి చేసుకుంటే ముందే అబ్బాయి, అమ్మాయికి పరిచయం ఉంటుంది కాబట్టి, ఒకరి ప్రవర్తన మరొకరికి తెలుసు కాబట్టి, సెక్స్ విషయంలో కొన్ని సమస్యలు కనబడవు. ముఖ్యంగా అబ్బాయి బెడ్ లో ప్రవర్తించే తీరు కొత్తగా ఉన్నా, అమ్మాయి అర్థం చేసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది ప్రేమ పెళ్ళిలలో. ఒకవేళ ఒక పద్ధతి నచ్చకపోయినా, అడ్డుకునే, మందలించే చనువు కూడా ఉంటుంది లవ్ మ్యారేజ్ లో. కాని పెద్దలు కుదిర్చిన పెళ్ళిలలో అలా కాదు.

అమ్మాయి, అబ్బాయి మొదటిసారి మనసువిప్పి మాట్లాడుకునేది మొదటిరాత్రి నాడే. అప్పుడు అబ్బాయి తన మీద మంచి అభిప్రాయం కలిగేలా ప్రవర్తించాలి. తొలి సంభోగంలోనే వింతగా ప్రవర్తించినా, రఫ్ గా మొదిలినా, భయపడిపోతుంది కొత్త పెళ్ళికూతురు. అందుకే తనతో ముందు ప్రేమగా మొదలాలి. కొత్తింటి వాతవరణానికి అలవాటు పడేదాకా, ఇష్టమొచ్చిన కోరికలు కోరకూడదు. భర్తతో సమయం గడిపే అవకాశం దొరికితే బాగుండు అని తనకి తానుగా అనుకోవాలి. అప్పుడే శృంగారంలో సరైన సహకారం దొరుకుతుంది.

అమ్మాయిలకి సహజంగానే సిగ్గు, భయం ఎక్కువ. వచ్చిరాగానే, సెక్స్ లో తన ఇష్టాలు, కోరికలు, ఇబ్బందులు అన్ని చెప్పుకోలేదు. దాన్ని కూడా అర్థం చేసుకోవాలి కొత్త పెళ్ళికొడుకు. కొత్త జంటలు శృంగారంలో ఇబ్బంది పడేది సరైన చనువు, అర్థం చేసుకునే మనస్తత్వం లేకే. అందుకే ఒకరిపై ఒకరికి ప్రేమ పుట్టాలి. ఇద్దరు మానసికంగా దగ్గరైతేనే, శారిరకంగా మరింత దగ్గర కావచ్చు.
Read: