News and Entertainment

ప్లేస్ లు మారుస్తూ,ఊరంతా తిప్పుతూ, ఒకరి తర్వాత ఒకరు వారం పాటు అత్యాచారం


రాజస్థాన్‌లో అత్యంత దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. 25 ఏళ్ల ఓ మహిళపై అత్యంత పాశవికంగా దాడి చేసింది ఓ ముఠా. ఆ మహిళను జీపులో ఎక్కించుకుని రహస్య ప్రదేశానికి తీసుకెళ్లిన ముగ్గురి ముఠా వారం రోజుల పాటు అత్యాచారానికి పాల్పడింది. ప్లేస్ లు మారుస్తూ ఊరంతా తిప్పుతు ఒకరి తరువాత ఒకరు 7 రోజులు పాటు ఆమె దేహన్ని వాడుకున్నారు. అక్కడితో ఆగకుండా ఆమెను ఓ వేశ్యా గృహనికి లక్ష రూపాయలకి అమ్మేశారు. అక్కడ మరో మూడు రోజుల పాటు నరకం చూపించారు కామాంధులు.

ఎలాగోలా ఆ రాక్షసుల నుండి తప్పించుకుని ఇంటికి వచ్చిన ఆ మహిళకు మరో షాక్ తగిలింది. తను కిడ్నాప్ అయినట్టుగా తెలుసుకున్న భర్త మనస్తాపానికి గురై మూడు రోజుల ముందే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఈ హృదయ విదారక ఘటన రాజస్థాన్ లోని చురు జిల్లాలో చోటు చేసుకుంది.


ఈ నెల 22 న అసల్ ఖేరీ బస్టాండ్ వద్ద ఇంటికి వెళ్లేందుకు వేచి ఉంది. అటు వైపుగా వచ్చిన ఓ జీపు భలేరీ పట్టణం వరకు వెళ్తామని చెప్పగానే అందులో ఎక్కింది. అయితే కాసేపటికే ఆ జీపు రూట్ మార్చి ఆ మహిళని మరో ప్రాంతానికి తీసుకెళ్లింది. అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు ఆమెను బంధించి ఈ ఘోరానికి పాల్పడ్డారని పోలీసుల ముందు వాపోయింది.ఈ ఘటన ఈ నెల 22 న చోటు చేసుకుంది. 22 న ఎత్తుకెళ్లిన ముఠా 28 వరకు ఆ మహిళని చిత్రహింసలకు గురి చేసింది. మంగళవారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే సదరు మహిళను ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు సమాచారం. నిందుతుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు అక్కడి పోలీసులు.