News and Entertainment

ఈ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ కండోమ్‌ మింగింది... తర్వాత ఏం జరిగిందంటే


ఇలాంటి సంఘటన ప్రపంచంలో ఇంతకు ముందు ఎక్కడ జరిగి ఉండదు. ఒక యువతి తన బాయ్‌ ఫ్రెండ్‌తో శృంగారం చేస్తున్న సమయంలో కండోమ్‌ను మింగేసింది. ఆ విషయాన్ని ఆ అమ్మాయి కూగా గమనించలేదు. శృంగార మోజులో ఉన్న ఆ యువతి కండోమ్‌ మింగిన విషయాన్ని గుర్తించకున్నా, డాక్టర్లు ఆ విషయాన్ని గుర్తించారు. కామెరూన్‌లో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం వెబ్‌ మీడియాలో తెగ హల్‌ చల్‌ చేస్తోంది.

ఈ సంఘటన పూర్తి కథనం ఏంటంటే... కామెరూన్‌కు చెందిన ఒక యువతి గత కొంత కాలంగా తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతుంది. అదే సమయంలో వాంతులు కూడా అవుతున్నాయి అంటూ ఒక హాస్పిటల్‌లో చేరింది. దాంతో వైధ్యులు ఈమెకు అపెండెక్స్‌ అయ్యిండవచ్చు అని భావించారు. స్కానింగ్‌ చేసి

చూశారు. ఆ యువతి అపెండెక్స్‌ లావుగా అయ్యి ఉండటం డాక్టర్లకు కనిపించింది. దాంతో వారు అపెండెక్స్‌ ఆపరేషన్‌కు సిద్దం అయ్యారు. ఆపరేషన్‌ చేస్తున్న సమయంలో వారు షాక్‌ అయ్యారు. ఆపరేషన్‌ చేస్తున్నప్పుడు రబ్బరు వంటి పదార్థం వారికి కనిపించింది. దాన్ని అంతా తొలగించి మళ్లీ కుట్టు వేశారు. ఆపరేషన్‌ తర్వాత బయటకు తీసిన ఆ రబ్బరు వంటి పదార్థాని పరీక్షించారు. తీక్షణంగా చూస్తే అదో కండోమ్‌ అని తేలింది. దాంతో అవాక్కయిన డాక్టర్లు ఎప్పుడో ఆ యువతి కండోమ్‌ మింగి ఉంటుందని నిర్థారణకు వచ్చారు. ఆమె కూడా కొన్ని వారాల క్రితం తాను తన బాయ్‌ ఫ్రెండ్‌తో శృంగారం చేశాను అని, ఆ సమయంలోనే ఈ కండోమ్‌ను మింగి ఉంటాను అంటూ ముసి ముసిగా నవ్వులు నవ్వింది.