News and Entertainment

2017లో శనిదేవుడి ప్రభావం ఏ రాశిపై ఎలా ఉంటుంది ??


2017 సంవత్సరం రాబోతోంది. ఈ ఏడాది జ్యోతిష్యం చాలా ప్రత్యేకంగా తీసుకోవాల్సి వస్తోంది. ఈ ఏడాది శని ప్రభావం ఏ రాశులపై ఎలా ఉండబోతోంది ? 30ఏళ్ల పాటు శని ఇలా అన్ని 12 రాశులపై ప్రభావం చూపిస్తోంది. అలా శని ప్రభావం ఒకటిన్నర ఏడాది ఒక రాశిపైనే ఉంటుంది. ఆ తర్వాతే.. మరో రాశివైపు ప్రభావం చూపుతుంది.

ఇప్పటివరకు శని ప్రభావం వృశ్చిక రాశిపై ఉండేది. 2017 జనవరి 26 నుంచి శని ధనస్సు రాశిపై ప్రభావం చూపించబోతోంది. ఆ తర్వాత 2020లో మకర రాశిలో శని ప్రభావం చూపించనుంది. ఇప్పుడు 2017లో ఏ రాశిపై శని ప్రభావం ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. అలాగే 2017లో ఏ రాశి వాళ్లకు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు, సక్సెస్ ని ఎలా పొందుతారో తెలుసుకుందాం..

మేషరాశి

2017లో మేషరాశి వాళ్లకు ఆర్థికంగా లాభాలు, ప్రొఫెషనల్ గా గ్రోత్ పొందుతారు. అలాగే కొన్ని మంచి బిజినెస్ డీల్స్ అందుకుంటారు. అయితే మిమ్మల్ని వెనక్కి లాగాలని భావించే వాళ్లతో చాలా జాగ్రత్తగా ఉండాలి.