News and Entertainment

భ‌ర్త నైట్ షిఫ్ట్‌కు వెళ్ల‌గానే….


మ‌న‌దేశంలో మ‌హిళ‌ల ర‌క్ష‌ణ కోసం నిర్భ‌య‌లాంటి ఎన్ని క‌ఠిన చ‌ట్టాలు వ‌చ్చినా వారిపై లైంగీక దాడులు మాత్రం ఆగ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే గుజ‌రాత్‌లో ఓ వివాహిత‌పై కొంద‌రు దండుగులు ఆమె ఇంట్లోనే సామూహిక అత్యాచారం చేశారు. గుజ‌రాత్‌లోని వ‌డోద‌రాలో జ‌రిగిన ఈ దారుణ సంఘ‌ట‌న పూర్తి వివ‌రాలు ఇలా ఉన్నాయి. ఓ టెక్స్ టైల్స్ కంపెనీలో పనిచేసే ఆ వివాహిత భ‌ర్త ఆరోజు నైట్ షిఫ్ట్ డ్యూటికి వెళ్ళాడు.
భ‌ర్త డ్యూటీకి అలా వెళ్ళగానే ఆ ఇంట్లో దారుణం జరిగింది. టెక్స్ టైల్స్ కంపెనీలో పనిచేసే వ్యక్తి భార్యపై ఇంటి పక్కనే ఉండే వ్యక్తి ఎప్పట్నించో కన్ను వేశాడు. సమయం కోసం వేచి చూస్తోన్న ఆ వ్య‌క్తి త‌న ప్లాన్ అమ‌లు చేశాడు. భ‌ర్త నైట్ డ్యూటీకి వెళ్ల‌డంతో ఆమె త‌న‌కు తోడుగా త‌న త‌మ్ముడిని తెచ్చుకుంది.

భ‌ర్త నైట్ డ్యూటీకి వెళ్లిన వెంట‌నే ఆమె కోసం ఎప్ప‌టి నుంచో వెయిట్ చేస్తోన్న కామాంధుడు మ‌రో ముగ్గురు యువ‌కుల‌ను తీసుకువ‌చ్చి త‌లుపుకొట్టాడు. హాల్లో పడుకుని ఉన్న ఆమె తమ్ముడు తలుపు ఎవరో తడతున్నారని వెళ్లి తీశాడు. వారు ఆ యువ‌కుడిపై దాడి చేసి ఓ రూమ్‌లో బంధించారు.
త‌ర్వాత బెడ్ రూంలో నిద్రిస్తోన్న వివాహిత‌పై ఆ ముగ్గురు ఒక‌రి త‌ర్వాత మ‌రొక‌రు అత్యాచారం చేశారు. ఈ విషయం ఎవరికైనా చెప్పినా తన తమ్ముడిని చంపేస్తామని బెదిరించారు. జరిగిన విషయాన్ని బాధితురాలు భర్తకు చెప్పడంతో.. భర్త పోలీసులను ఆశ్రయించాడు. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు.

Read: ఈ భంగుమల్లో సెక్స్ చేస్తే అమ్మాయిలకి ఇష్టమట