News and Entertainment

ఆ గుడి వ‌ల్లే జ‌య‌ల‌లిత మ‌ర‌ణం..!


త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత దాదాపు 80 రోజుల పాటు తీవ్ర అనారోగ్యంతో బాధ‌ప‌డి వైద్య చికిత్స నుంచి కోలుకున్న‌ట్టే కోలుకుని మృతి చెంద‌డం త‌మిళ జ‌నాల‌ను తీవ్ర నైరాశ్యంలో ముంచింది. జ‌మ మృతిపై త‌మిళ‌నాట‌, జాతీయ మీడియాలో ర‌క‌ర‌కాల కార‌ణాలు వినిపిస్తున్నాయి. కోలుకుంటుంద‌నుకుంటున్న టైంలో అమ్మ ఇలా అనూహ్యంగా ప్రాణాలు కోల్పోవ‌డం వెనుక ఒక ఆల‌యంలోని మూల‌విరాట్టు విగ్ర‌హాన్ని మార్చ‌డ‌మేన‌న్న సందేహాలు ఇప్పుడు త‌మిళ‌నాడులో వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

కాంచీపురంలోని ప్రసిద్ధ ఏకాంబరనాథర్‌ ఆలయంలో ఇటీవలే కొత్త విగ్రహాన్ని ప్రతిష్టించారు. కాంచీపురం జిల్లాలో అత్యంత పురాతనమైన చ‌రిత్ర క‌లిగిన ఈ ఆలయంలోని మూలవిరాట్టు విగ్రహం మట్టితో త‌యారు చేయించారు. ఈ విగ్ర‌హం దాదాపు మూడు వేల సంవ‌త్స‌రాల క్రితం త‌యారు చేసిన‌ట్టు చారిత్ర‌క ఆధారాలు ఉన్నాయి.


ఇటీవ‌ల కాలంలో ఆ విగ్ర‌హం ధ్వంస‌మైంద‌న్న కార‌ణంతో ఆ మ‌ట్టి విగ్ర‌హం స్థానంలో కొత్త విగ్ర‌హం ఏర్పాటు చేయాల‌ని భావించారు. కొంద‌రు మాత్రం దానిని వ్య‌తిరేకించారు. ఆల‌యంలో 3 వేల సంవ‌త్స‌రాల నుంచి ఉన్న మూల విరాట్టును క‌దిపితే రాష్ట్ర అధినేత‌కు ప్రాణాపాయం త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించారు.

ఆల‌య నిర్వాహ‌కులు మాత్రం వారి హెచ్చ‌రిక‌ల‌ను పెడ‌చెవిన పెట్టి మూల‌విరాట్టు విగ్ర‌హాన్ని తొల‌గించి ఆ స్థానంలో కొత్త విగ్ర‌హాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా చెప్పిన‌ట్టు మూల‌విరాట్టును తొల‌గిస్తే రాష్ట్ర అధినేత‌కు మ‌ర‌ణం త‌ప్ప‌ద‌న్న‌ట్టుగానే జ‌య మృతి చెందిద‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ నెల 5 వ తేదీన ఈ మూల‌విరాట్టును క‌దిలించ‌గా, అదే రోజున జ‌య మృతిచెంద‌డం గ‌మనార్హం.

Read: జయలలిత సమాధి వద్ద సంచరిస్తున్న ఆత్మ.. అమ్మ దేనా..?