News and Entertainment

జయలలిత సమాధి వద్ద సంచరిస్తున్న ఆత్మ.. అమ్మ దేనా..?


తమిళనాడు ప్రజలందరూ తమ ‘అమ్మ’గా భావించే ముఖ్యమంత్రి జయలలిత ఆకస్మిక మరణం యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అమ్మ ఇక లేరనే వార్తను తమిళులు జీర్ణించుకోలేకపోతున్నారు. అమ్మ సమాధి అయి అయిదు రోజులు దాటినా మెరీనా బీచ్‌లో అమ్మ సమాధి వద్ద ఇంకా రద్దీగానే ఉంది.
ఈ నేపథ్యంలో ‘అమ్మ’ సమాధి వద్ద ఓ ఆత్మ కనిపించిందని తమిళ వెబ్‌సైట్లు వార్తలు ప్రచురించాయి. ఆ ఆత్మ ‘అమ్మ’ ఆకారాన్ని పోలి ఉందని, తన సమాధిని చూసేందుకు జయలలిత ఆత్మగా వచ్చిందంటూ ఆ వెబ్‌సైట్లు పేర్కొన్నాయి. ‘అమ్మ’ ఆత్మ అంటూ ఓ ఫొటో ఇప్పుడు సోషల్‌మీడియాలో కూడా వైరల్‌గా మారింది. యావత్తు తమిళ జాతికి అమ్మగా నిలిచిన జయలలిత ఆకస్మిక మరణం మిస్టరీగా మారిన విషయం తెలిసిందే. ఆమెది సహజ మరణం కాదని,


విష ప్రయోగం జరిగిందని పలువురు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. ఆత్మలపై నమ్మకం ఉన్న వాళ్లు సమర్ధించడానికి ఓ కారణం కూడా దొరికింది. అమ్మకు ప్రధాని కావాలనే కోరిక ఉండేదని, అది తీరకపోవడంతో ఆత్మగా మారి ఉంటుందని దేవుళ్లను, ఆత్మలను నమ్మేవారి వాదన. ఆధునిక కాలంలోనూ ఇవేం మూఢనమ్మకాలంటూ చాలామంది నెటిజన్లు ఆగ్రహిస్తున్నారు. ఇది కచ్చితంగా ఫొటోషాప్ మాయాజాలమే అని కొట్టిపారేస్తున్నారు.

Read: జయలలిత కూతురి పై క్లారిటీ.. నిజం చెప్పిన ప్రముఖ గాయిని
Read: షాకింగ్...ఆంధ్రప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి నారా బ్రాహ్మణి...!