News and Entertainment

నా భ‌ర్త లేడు…నాతో ఎవ‌రైనా గ‌డుపుతారా..అంటూ…


భర్త తోడు లేకుండా ఒంటరిగా ఉన్నాను, ఎవరైనా నాతో గడపాలనుకుంటే నన్ను సంప్రదించవచ్చు అని ఫోన్‌నెంబరుతో సహా ముద్రించిన కరపత్రాలను పంచి మహిళను అభాసుపాలు చేసిన వ్యక్తిని, అతనికి సహకరించిన ప్రింటింగ్‌ ప్రెస్‌ నిర్వాహకుడిని కేపీహెచ్‌ పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. కూకట్‌ పల్లి ఏసీపీ భుజంగరావు విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు.


నిజాంపేటలో నివాసముండే ఓ మహిళ భర్త ఉండగానే మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండేది. ఇదిలా ఉండగా నాలుగు నెలల క్రితం మహిళ భర్త రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. భర్త చనిపోయాక ఆ మహిళ సన్నిహితంగా ఉన్న వ్యక్తిని అలక్ష్యం చేయడంతో ఆగ్రహంతో అతడు జీడిమెట్లలోని ఓ ప్రింటింగ్‌ ప్రెస్‌లో మహిళపై అసభ్యమైన పదజాలంతో కరపత్రం ప్రిటింగ్‌ చేయించాడు. 500 కరపత్రాలను మహిళ నివాసముండే ప్రాంతంలో పంపిణీ చేశాడు. కరపత్రాలను చూసిన ఇరుగు పొరుగు వారు ఈ విషయాన్ని సదరుమహిళకు తెలుపడంతో తీవ్ర ఆవేదనకు గురైన ఆ మహిళ కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకుని అసలు విషయం రాబట్టారు. నిందితుడిపైనా ప్రిటింగ్‌ప్రెస్‌ నిర్వాహ కుడిపైనా 354, 509, 501 సెక్షన్ల కింది కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్న కేపి హెచ్‌బీఎస్సె విజయ్‌కుమార్‌ను ఏసీపీ అభినందించారు. సమావేశంలో బాచుపల్లి సీఐ బాలకృష్ణారెడ్డి, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.