News and Entertainment

14వేల మంది ఉద్యోగుల‌ను నిర్దాక్షిణ్యంగా తీసేసిన L&T !?


స‌రిగ్గా ప‌నిచేయ‌కో, అవినీతి చేసో లేదంటే మ‌రో ఇత‌ర కార‌ణం వ‌ల్లో అయితే ప్ర‌భుత్వ ఉద్యోగులను పై అధికారులు స‌స్పెండ్ చేస్తారు. లేదంటే వేరే ప్రాంతానికి బ‌దిలీ చేస్తారు. అయినా వారిని ఉద్యోగం నుంచి మాత్రం తీసేయ‌రు. అదీ… ప్ర‌భుత్వ ఉద్యోగంలో ఉన్న సెక్యూరిటీ అంటే. కానీ ప్రైవేటు ఉద్యోగం మాత్రం అలా కాదు. ఎప్పుడు ఏమ‌వుతుందో తెలియ‌దు. మ‌న‌కు ఉద్యోగం ఇచ్చిన కంపెనీ దివాళా తీయ‌వ‌చ్చు. లేదంటే మ‌నం చేసే చిన్న చిన్న త‌ప్పులే పై అధికారుల‌కు పెద్ద‌గా క‌నిపించి వారు మ‌న‌ల్ని తీసేయ‌వ‌చ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రైవేటు జాబ్‌ల‌కు అనేక కార‌ణాలు క‌నిపిస్తాయి, ఉద్యోగం తీసివేయ‌డానికి. అదిగో… ఎల్ అండ్ టీ కంపెనీ కూడా స‌రిగ్గా ఇలాంటి ల‌క్షా 90 కార‌ణాలు చెప్పి దాదాపుగా 14వేల మంది ఉద్యోగుల‌ను ఒకేసారి తీసేసింది.



ఏటా వ‌స్తున్న న‌ష్టాల‌కు అనుగుణంగా ఎంతో కొంత మ్యాన్ ప‌వ‌ర్‌ను త‌గ్గించుకోవ‌డం, ప‌నుల‌న్నీ డిజిట‌లైజ్ అవ‌డం, మ‌నుషులు చేసే చాలా పనులు ఇప్పుడు యంత్రాలే చేస్తుండ‌డం, ఆయిల్ ధ‌ర‌లు త‌గ్గుతుండ‌డం, విదేశీ కంపెనీల మ‌ధ్య నెలకొన్న పోటీ వంటి అనేక కార‌ణాల‌ను చూపుతూ ఎల్ అండ్ టీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. అయితే మ‌న దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఓ ప్రైవేటు కంపెనీ ఇంత భారీ స్థాయిలో ఉద్యోగుల‌ను తొల‌గించ‌డం ఇదే ప్ర‌థ‌మ‌ం.
మరో విషయం ఏంటంటే…హైద్రాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ ను టేకోవర్ చేసింది కూడా L&T నే, మరి అంత మంది ఉద్యోగులను ఏకకాలంలో తీసేస్తే…. ఆ నిర్ణయం  మన మెట్రో ప్రాజెక్ట్ పై ఎటువంటి ప్రభావం పడుతుందో చూడాలి.! ఇప్పటికే ఆలస్యం అవుతున్న మెట్రో ప్రాజెక్ట్ మీద…..నిజంగానే ఈ ఉద్యోగుల తొలగింపు ఎఫెక్ట్ పడితే…నగర వాసుల ట్రాఫిక్ కష్టాలకు ఎక్స్ టెంన్షనే.Q