News and Entertainment

మెగా ఫ్యామిలీలో విషాదం...!మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ధృవ సినిమా విడుదల హడావుడిలో ఉన్న మెగా ఫ్యామిలీలో విషాదం చోటు చేసుకుంది. దివంగత కమెడియన్ అల్లు రామలింగయ్య పెద్ద కుమార్తె, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ పెద్ద అక్క అయిన భారతి ఈ రోజు ఉదయం కన్ను మూశారు. గత కొంత కాలంగా ఆమె అనారోగ్యంతో బాధ పడుతున్నట్టు తెలుస్తోంది. నిన్న(4-12-2016) ధృవ ప్రి రీలీజ్ ఫంక్షన్ జరుపుకున్న మెగా కుటుంబాన్ని భారతి మరణం విషాదం లోకి నెట్టింది.అల్లు అర్జున్ కు తన మేనత్త అయిన భారతి తో ఎంతో సాన్నిహిత్యం ఉండేదని సమాచారం. ఇంటికి పెద్ద దిక్కు కావడంతో అల్లు కుటుంబానికి భారతి అంటే అమితమైన అభిమానం అని తెలుస్తోంది. ఆమెకు వివాహం కాలేదని అల్లు అరవింద్ ఇంట్లోనే ఉంటున్నారని తెలుస్తోంది. భారతి మరణంతో ధృవ ప్రమోషన్లు ఆగిపోయాయి. ధృవ సినిమా ఈ నెల 9 న విడుదల కానుంది. రామ్ చరణ్ నటిస్తున్న ఈ సినిమాకు అల్లు అరవింద్ నిర్మాత.