News and Entertainment

వీడియో :అమ‌రావ‌తి బాబా రాస‌లీల‌లు చూస్తారా ?తాను దేవదూత అంటూ ఇప్ప‌టి వ‌ర‌కు భ‌క్తుల‌ను మ‌భ్య‌పెడుతూ వ‌స్తోన్న మ‌హారాష్ట్ర‌లోని అమరావతి మురళీధర్ బాబా అసలు రూపం బయటపడింది. ఓ భక్తురాలితో ముర‌ళీధ‌ర్ బాబా న‌డిపిన రాస‌లీల‌ల వ్య‌వ‌హారం సీసీటీవీ ఫుటేజ్ ద్వారా వెలుగులోకి వచ్చింది. బాబా ఆశ్ర‌మంలో ఉన్న బాత్ రూంలో పెట్టిన సీక్రెట్ కెమెరా ద్వారా అసలు రూపం వెలుగులోకి వచ్చింది.
వాస్త‌వానికి గ‌తంలోనే ముర‌ళీధ‌ర్ బాబా ఐదారు మహిళలతో బాబా ఇలా వ్యవహరించినట్టు వార్తలు వెలువచ్చాయి. అయితే వీటికి స‌రైన ఆధారాలు లేక‌పోవ‌డంతో వాటిని ఎవ్వ‌రూ న‌మ్మ‌లేదు. తాజాగా బాబా బాత్ రూంలోని సీసీ కెమేరాల్లో ఓ యువ‌తితో అత‌డు న‌డిపిన రాస‌లీలలు బ‌య‌ట‌కు రావ‌డంతో బాబా భ‌క్తులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. భక్తులు మురళీధర్ బాబా కాదని, శృంగార పురుషుడంటూ ధ్వ‌జ‌మెత్తుతున్నారు.