News and Entertainment

ఆ అమ్మాయి పంపించిన లింక్ ఓపెన్ చేయగానే.. నేవీ ఆఫీస‌ర్‌ కి దిమ్మ తిరిగింది

ఫేస్‌ బుక్‌ ఛాటింగ్‌ తో కాల‌క్షేపం చేస్తున్న ఓ నేవీ ఆఫీస‌ర్‌ ఓ అమ్మాయి ఇచ్చిన షాక్ తో దిమ్మ తిరిగింది. ఆ వివరాలలోకి వెళితే.. విశాఖ‌ప‌ట్నంలోని నేవీ ఆఫీస‌ర్ హ‌ర్షుక్‌ ని అదే ఫేస్‌ బుక్‌ లో మాయ‌మాట‌లు చెప్పి ఓ అమ్మాయి మోసం చేసింది. ఛాటింగ్‌ లో హలో అంటూ ప‌రిచ‌య‌మైన అమ్మాయితో కొన్ని రోజులుగా ఛాటింగ్ చేస్తున్నాడు హ‌ర్షుక్‌. అప్పుడు ఆ అమ్మాయి 'నీతో మాట్లాడాలని ఉంది. నీ ఫోన్ నెంబర్ ఇవ్వు' అని అడిగింది. అడగగానే అతను నెంబ‌రు ఇచ్చాడు. త‌న వ‌ద్ద ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోయింద‌ని.. త‌న‌కు ఆన్‌లైన్‌లో 50 రూపాయ‌లు రీఛార్జ్ చేయ‌మ‌ని అడిగింది.

అయితే.. త‌నకు ఆన్‌లైన్ ద్వారా రీఛార్జ్ చేయ‌డం రాద‌ని హ‌ర్షుక్ ఆ అమ్మాయితో చెప్పడంతో.. వెంట‌నే ఆ అమ్మాయి ఓ లింకు పంపించింది. ఆ లింక్ తో ఈజీగా రీఛార్జ్ చేసుకోవ‌చ్చ‌ని చెప్పింది. ఆ అమ్మాయి పంపిన లింకుపై క్లిక్ చేసి 50 రూపాయలు రీఛార్జ్ చేసాడు హ‌ర్షుక్‌. అంతే వెంటనే 'మీ అకౌంట్ నుంచి 50 వేల రూపాయ‌లు క‌ట్ అయ్యాయి. కృతజ్ఞతలు' అని మెస్సేజ్ వచ్చింది. దీనితో నేవీ ఆఫీస‌ర్‌ కి దిమ్మ తిరిగింది. వెంట‌నే హ‌ర్షుక్ స్థానిక పోలీసుల‌కి ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ కేసును సైబ‌ర్ క్రైం పోలీసుల‌కి బ‌దిలీ చేయడంతో.. మాయ‌లేడీ పంపింది ఒరిజిన‌ల్ లింక్ కాదని పోలీసులు తెలిపారు. దీనిపై పోలీసులు విచారిస్తున్నారు.