News and Entertainment

స్మార్ట్ ఫోన్లను హడలెత్తిస్తున్న గూలిగన్ వైరస్.! తేడా వస్తే…అంతా గోవిందా.!


ఫ్లాష్‌… ఫ్లాష్‌… మీరు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా..? అయితే జాగ్ర‌త్త‌..! వెంట‌నే మీరు వాడుతున్న ఫోన్‌కు చెందిన గూగుల్ అకౌంట్ పాస్‌వ‌ర్డ్‌, సెక్యూరిటీ ప్ర‌శ్న‌ల‌ను మార్చేయండి..! ఒక వేళ మీ ఆండ్రాయిడ్ డివైస్ స‌రిగ్గా ప‌నిచేయ‌కుండా హ్యాంగ్ అవుతున్నా, లేదంటే దానిక‌దే స్విచాఫ్ అయి ఆన్ అవుతున్నా, యాప్స్ వాటంత‌ట అవే ఇన్‌స్టాల్ అవుతున్నా, వెంట‌నే ఫోన్‌ను స్విచాఫ్ చేసి, స‌ద‌రు డివైస్ స‌ర్వీస్ సెంట‌ర్‌కు తీసుకెళ్లి కొత్త సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేయించుకోండి. లేదంటే మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఉన్న డేటా అంతా హ్యాక‌ర్ల చేతుల్లోకి వెళ్ల‌డం ఖాయం. ఎందుకంటే గూలిగన్ (Gooligan) అనే పేరున్న ఓ కొత్త త‌రహా వైర‌స్ ఇప్పుడు ఆండ్రాయిడ్ డివైస్‌ల‌లోకి శ‌ర వేగంగా వ్యాప్తి చెందుతోంది.

ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన కంప్యూట‌ర్ వైర‌స్‌లు, స్మార్ట్‌ఫోన్ వైర‌స్‌ల‌లో కెల్లా ఈ గూలిగ‌న్ వైర‌సే అతి పెద్ద‌ద‌ని ఐటీ సెక్యూరిటీ నిపుణులు చెబుతున్నారు. ఈ వైర‌స్ గ‌త నెల‌లో కొన్ని ల‌క్ష‌ల ఆండ్రాయిడ్ డివైస్‌ల‌లోకి వ్యాప్తి చెందింద‌ని తెలిసింది. రోజుకు కొన్ని వేల డివైస్‌ల‌కు ఈ వైర‌స్‌ కొత్త‌గా వ్యాప్తి చెందుతుంద‌ట‌. యూజ‌ర్లు సోష‌ల్ మీడియాలో క‌న‌బ‌డిన లింక్‌ల‌ను క్లిక్ చేసిన‌ప్పుడు లేదంటే గూగుల్ ప్లే స్టోర్ నుంచి కాకుండా ఇత‌ర థ‌ర్డ్‌పార్టీ స్టోర్స్‌, సైట్స్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న యాప్స్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటున్నార‌ని, వాటితో ఇన్‌బిల్ట్‌గా ఈ వైర‌స్ వ్యాప్తి చెందుతుంద‌ని ఐటీ నిపుణులు చెబుతున్నారు.ప‌ర్‌ఫెక్ట్ క్లీన‌ర్‌, డెమో, వైఫై ఎన్‌హాన్స‌ర్‌, స్నేక్‌, గ్లా, హెచ్‌టీఎంఎల్ 5 గేమ్స్‌, డెమ్‌, మెమోరీ బూస్ట‌ర్‌, స్టాప్ వాచ్‌, క్లియ‌ర్‌, బాల్స్ మూవ్‌, ఫ్లాష్ లైట్ ఫ్రీ, మెమోరీ బూస్ట్‌, ట‌చ్ బ్యూటీ, డిమాండ్‌, స్మాల్ బ్లూ పాయింట్‌, బ్యాట‌రీ మానిట‌ర్‌, యూసీ మినీ, షాడో క్ర‌ష్‌, సెక్స్ ఫొటో, హిప్ గుడ్‌, మెమోరీ బూస్ట‌ర్‌, ఫోన్ బూస్ట‌ర్‌, సెట్టింగ్స్ స‌ర్వీస్‌, వైఫై మాస్ట‌ర్‌, ఫ్రూట్ స్లాట్స్‌, సిస్ట‌మ్ బూస్ట‌ర్‌, డైరెక్ట్ బ్రౌజ‌ర్‌, ఫ‌న్నీ డ్రాప్స్‌, ప‌జిల్ బ‌బుల్ పెట్ ప్యార‌డైజ్‌, జీపీఎస్‌, లైట్ బ్రౌజ‌ర్‌, క్లీన్ మాస్ట‌ర్‌, యూట్యూబ్ డౌన్‌లోడ‌ర్ త‌దిత‌ర యాప్స్‌తో ఈ కొత్త త‌ర‌హా గూలిగ‌న్ వైర‌స్ వ్యాప్తి చెందుతుంద‌ని తెలిసింది.

ఆండ్రాయిడ్ జెల్లీ బీన్‌, కిట్‌క్యాట్, లాలిపాప్ త‌దిత‌ర వెర్ష‌న్ల‌ను వాడుతున్న యూజ‌ర్ల డివైస్‌ల‌లో ఈ వైర‌స్ వ్యాప్తి చెందుతోంది. ఒక‌సారి ఈ వైర‌స్ వ‌చ్చిందంటే చాలు, వెంట‌నే డివైస్‌లో ఉన్న గూగుల్ అకౌంట్ వివ‌రాల‌ను హ్యాక‌ర్లకు చేర‌వేస్తుంది. అనంత‌రం బ్యాంకింగ్ లావాదేవీల వివ‌రాలు కూడా దశ‌ల వారీగా హ్యాకర్ల‌కు చేరుతాయి. అలా చేరుతున్న‌ట్టు కూడా యూజ‌ర్ల‌కు తెలియ‌దు. క‌నుక యూజ‌ర్ల‌కు త‌మ డివైస్ ప‌నితీరుపై ఏమాత్ర అనుమానం వ‌చ్చినా వెంట‌నే డివైస్‌ను స్విచాఫ్ చేసి, స‌ర్వీస్ సెంట‌ర్‌కు తీసుకువెళ్లి కొత్త సాఫ్ట్‌వేర్‌ను వేసుకోవాల‌ని ఐటీ సెక్యూరిటీ నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. అలాగే గూగుల్ అకౌంట్ పాస్‌వ‌ర్డ్‌ను కూడా మార్చేయాల‌ని వారు చెబుతున్నారు.