News and Entertainment

ఒక 72 సంవత్సరాల పెద్దావిడ మోడీ కి ఘాటైన లేఖ.. పొదుపు కింద కూడబెట్టిన బంగారాన్ని లెక్క చూపించడం సాధ్యమేనా..??పాపిడి బిళ్ల, ముక్కెర, వడ్డాణం, దుద్దులు, మట్టెలు, ఏడు వారాల నగలు, ఉంగరాలు, వంకీలు, కంఠాహారాలు, జెడ బిళ్ల, గాజులు, కడియాలు, పట్టగొలుసులు.. వాటిల్లో అత్తవి ఏవి? కోడలివి ఏవి? కోడలి స్త్రీధనం కింద వచ్చినవెన్ని? తరువాత కొన్నవేమిటి? అత్తకు వారసత్వంగా వచ్చిన నగలెన్ని? మామగారు కొనిచ్చివెన్ని? రాళ్లు, వజ్రాలు, ముత్యాలు తీసేస్తే మిగిలే సూకా బంగారం ఎంత? బిడ్డ పెళ్లి అవసరానికి కొనుగోలు చేసి పెట్టుకున్న బంగారం బరువెంత ? ఏమిటిది? ఏమిటీ లెక్కలు? ఎందుకీ లెక్కలు? ఎవరు చెబుతారు? పెళ్లయిన ఆడవాళ్లు 50 తులాలు, పెళ్లికాని ఆడవాళ్లు 25 తులాలు, మగాళ్లు 10 తులాలు. అంతే ఎవరైనా అధికారి వచ్చి అడిగితే వాటికే మినహాయింపు. మిగతా బంగారానికి లెక్క చెప్పాల్సిందే ఆధారాలు చూపాల్సిందే.
తలాతోకా లేని ప్రణాళికతో, చేతిలో కొత్త నోట్లు లేకుండానే పాత నోట్లను రద్దుచేసి పారేసి, మీ చావు మీరు చావండి అని చావబాదుతున్న మోడీ ప్రభుత్వం బంగారంపైనా పడబోతున్నదనే వార్తలు కొద్దిరోజులుగా ఉన్నవే. వారసత్వంగా వచ్చే నగలు, వెల్లడించిన ఆదాయంతో కొనుగోలు చేసిన నగలపై పన్ను ఉండదు కానీ, మిగతా బంగారానికి లెక్క ఉండాలి, లేదంటే 75 శాతం వరకూ పన్ను వసూలు చేస్తారు.


కానీ మోడీజీ ఏ నగలు వారసత్వంగా వచ్చినవో ఎలా చెప్పాలి? వాటి డిజైన్లు, మోడళ్ల ఆధారంగానా…? తరతరాలుగా సంక్రమించే నగలకు రుజువులు, ఆధారాలు, కాగితాలు ఉంటాయా ? పోనీ, స్త్రీధనాన్ని ఎలా చూపించుకోవాలి ? వాటికి బిల్లులు ఏముంటాయి ?
ఒక మధ్యతరగతి లేదా ఎగువ మధ్యతరగతి ఇంటాయన బిడ్డ పెళ్లి కోసం

30 తులాలో, 40 తులాలో అప్పుడు కొంత, ఇప్పుడు కొంత కొన్నాడు ఇంట్లో పెట్టుకున్నాడు తనకు కొంత, పెళ్లానికి కొంత బంగారం ఉండనే ఉంది. ఎవడో అధికారి వచ్చి అన్నింటికీ లెక్కలు చూపించు, కాగితాలు చూపించు, వారసత్వ నగలకు రుజువులు చూపించు. లేదంటే స్వాధీనం అన్నాడే అంటే వాడెలా చావాలి…? ఓ ఆడపిల్లకు బంధువులు, దగ్గరి రక్తబంధువులు చిన్నప్పటి నుంచీ అభిమానంతో ఇచ్చే కానుకలకు లెక్కలేముంటాయి? వాటికి రుజువులేముంటాయి…?
అసలు అవినీతి, నల్లధనం మూలాలను నరికేయకుండా ఇవేమీ పనిచేయవు. ఎవరు చెప్పినా ఇప్పుడు మోడీ దాన్ని వినే స్థితి కూడా లేదు… దాటిపోయింది.