News and Entertainment

నోట్ల రద్దు పై సంచలన వ్యాక్యలు చేసిన పోసాని


నిజాయతీకి, ముక్కు సూటితనానికి కేరాఫ్ అయిన పోసాని.. నరేంద్ర మోడీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం పై సంచలన వ్యాక్యలు చేశారు. 500, 1000 రద్దుతో ప్రజలు పడుతున్న బాదలపై తీవ్రంగా స్పందించారు. “మీరు బహిరంగ సభలు పెట్టాలంటే కార్యకర్తలను తరలించడానికి.. రోడ్లు, కూడళ్లు నిండిపోయేలా హోర్డింగులు పెట్టడానికి.. ఎన్నికల్లో పంచడానికి కోట్లు కావాలి. అంటే రాజకీయ నాయకులు డబ్బులు వినియోగించుకోవాలి.


దేశ ప్రజలు మాత్రం చెక్కులివ్వాలి. ఆధారాలు చూపే పత్రాలివ్వాలి. కొంత మొత్తమే అకౌంట్లో ఉంచుకోవాలి. ప్యూర్ గా ఉండాలి. ఫెయిర్ గా ఉండాలి. ట్రాన్స్ పరెంట్ గా చూపించాలి. ఇదెక్కడి న్యాయం రాజా? మీకొక రూల్, మాకొక రూల్ అంటే ఎలా? మీరు, మీ పార్టీలు ఖర్చుపెట్టే ప్రతిపైసాకి లెక్కలు చూపిస్తారా రాజా?” అంటూ మండిపడ్డారు ఆయన.