News and Entertainment

‘ధృవ’ మొదటి రోజు కలెక్షన్స్‌


రామ్‌ చరణ్‌ హీరోగా నటించిన ‘ధృవ’ సినిమాకు భారీ ఓపెనింగ్స్‌ వచ్చాయి. ముందు నుండి అనుకున్నట్లుగానే ఈ సినిమాను అల్లు అరవింద్‌ భారీగా అత్యధిక థియేటర్లలో విడుదల అయ్యేలా ప్లాన్‌ చేశాడు. ఈ చిత్రం చరణ్‌ కెరీర్‌లోనే అత్యధిక థియేటర్లలో విడుదల చేసినట్లుగా తెలుస్తోంది. ఇంత భారీగా విడుదల అయిన ఈ సినిమా భారీ కలెక్షన్స్‌ను రాబట్టింది. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఏకంగా 10.5 కోట్లు వసూళ్లు చేసినట్లుగా అధికారిక సమాచారం వస్తుంది.


ఈ చిత్రం నైజాం ఏరియాలో 3.4 కోట్లు, సీడెడ్‌లో 2.3 కోట్లు, వైజాగ్‌లో 1.4 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో 90 లక్షలు, పశ్చిమగోదావరిలో 92 లక్షలు, కృష్ణా జిల్లాలో 72 లక్షలు, గుంటూరులో 44 లక్షలు, నెల్లూరులో 44 లక్షలు వసూళ్లు చేసింది. పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఉన్నప్పటికి ఈ స్థాయిలో వసూళ్లు సాధించడం గొప్పే అని సినీ వర్గాల వారితో పాటు, మెగా ఫ్యాన్స్‌ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.