News and Entertainment

లీకైన ధృవ సినిమా సీన్ !? పేపర్లో వచ్చిన న్యూస్ ను రామ్ చరణ్ విశ్లేషించిన తీరుచాలా బాగుంది.


లీకుల స‌మ‌స్య టాలీవుడ్ ను ప‌ట్టిపీడిస్తోంది. ఎంత ముందు జాగ్ర‌త్త‌లు తీసుకున్న లీక్ లు మాత్రం ఆగ‌డం లేదు. చిన్నసినిమా నుండి మొద‌లు భారీ బ‌డ్జెట్ చిత్రాల వ‌ర‌కు లీకుల గోలే న‌డుస్తోంది. తాజాగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌రణ్ తేజ న‌టించిన ధృవ చిత్రానికి కూడా ఈ చిక్కులు త‌ప్ప‌లేదు. ఈ నెల 9 న రిలీజ్ కు సిద్ద‌మ‌వుతుండ‌గా ఏకంగా 15 నిమిషాల నిడివి గ‌ల మూవీ లీకైన వార్త ఆందోళ‌న క‌లిగిస్తోంది. అయితే ఈ లీక్ ఎవ‌రు చేశారు.. సోష‌ల్ మీడియాలో ఎవ‌రు అఫ్లోడ్ చేశారు అన్న విష‌యం మాత్రం ఇంకా తెలియ‌రాలేదు. అటు చిత్ర యూనిట్ కూడా ఈ లీక్ పై నోరు మెద‌ప‌క పోవ‌డంతో ఈ లీకేజీపై మ‌రిన్ని అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.
రామ్ చరణ్ బ్రూస్ లీ లాంటి భారీ ఫ్లాప్ తర్వాత న‌టిస్తున్న చిత్రం కావ‌డంతో ఈ లీక్ మైన‌స్ గానే ఉండే అవ‌కాశాలున్నాయ‌ని తెలుస్తోంది. తమిళంలో భారీ హిట్ ను సొంతం చేసుకున్న‌ తని ఒరువన్ చిత్రానికి రీమేక్ రామ్ చ‌ర‌ణ్ న‌టించిన‌ ధృవ‌. ఎలాగైనా హిట్ కొట్టాల‌న్న క‌సి మీదున్న రామ్ చ‌ర‌ణ్ కు ఈ లీక్ క‌లిసొస్తుందా లేక నిండా ముంచుతుందా చూడాలి. ఇక ధృవ ట్రైలర్ మాత్రం….ఈ సినిమాపై అంచనాలను బారీగా పెంచేసింది.
న్యూస్ పేపర్ లో వచ్చే మెయిన్ న్యూస్ కి…బిజినెస్ పేజీకి మద్యగల లింక్ ను  రామ్ చరణ్ అనాలసిస్ చేస్తున్న ఈ సీన్ సినిమా మీద మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది.