News and Entertainment

నాతో శారీరక సంబంధం పెట్టుకుని వేరే పెళ్లి చేసుకున్నాడు.. పెళ్లి తర్వాత కూడా నా నుండి సుఖాన్ని కోరుకుంటూనే ఉన్నాడు.. మా బాస్‌ నుండి దూరంగా ఉండటం ఎలా?


ప్రశ్న : బెంగళూరులోని ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో జాబ్‌ చేస్తూ ఉన్నాను. అమ్మాయిని అయినా కూడా అందరితో చనువుగా మాట్లాడటం, అందరి పనుల్లో తల దూర్చడం, ఎక్కువ యాక్టివ్‌గా ఉండేదాన్ని. దాంతో ఒకానొక సమయంలో బాస్‌ దృష్టిలో పడ్డాను. నా పనిలో వేగం, చెలాకీ తనం అన్ని కూడా బాస్‌కు బాగా నచ్చాయి. దాంతో ఆఫీస్‌ తర్వాత కూడా ఇద్దరం మాట్లాడుకునేవాళ్లం. చాటింగ్‌, మాట్లాడుకోవడాలు జరిగాయి. కొన్ని రోజుల్లోనే ఇద్దరం శారీరకంగా కలిశాము. పెళ్లి చేసుకుంటాడనే నమ్మకంతో ఆయనతో హద్దులు దాటాను. ఈ విషయాలు అన్ని కూడా ఆఫీస్‌లో తెలుస్తూనే ఉండేవి. మా ఇద్దరి మద్య సంబంధం కొనసాగుతున్న సమయంలోనే ఆయన ఎంగేజ్‌మెంట్‌ వార్త నాకు తెలిసింది. చూస్తుండగానే ఎంగేజ్‌మెంట్‌ మరియు పెళ్లి రెండు కూడా జరిగిపోయాయి. పెళ్లి తర్వాత కూడా ఆయన నా నుండి సుఖాన్ని కోరుకుంటూనే ఉన్నాడు. కాని నేను మాత్రం ఆయనకు దూరంగా ఉంటూ వస్తున్నాను. నేను జాబ్‌ మానలేని పరిస్థితి. ఆయన నుండి దూరంగా ఎలా ఉండాలో అర్థం కావడం లేదు. దీనికి మీరే ఏదైనా మార్గం చూపించాలి. (ఓ సోదరి)

సమాధానం : పెళ్లి చేసుకుంటాడు అనే నమ్మకంతో సర్వస్వం అర్పించాను అంటూ మీరు చెబుతున్నారు. పెళ్లికి ముందు, ప్రేమ ముసుగులో ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి రోజు కూడా మీడియాలో ఇలాంటివి చూస్తూనే ఉన్నారు. అయినా కూడా మీరు అతడి కోర్కెలు తీర్చే వస్తువుగా మారిపోయారు. అయ్యిందేదో అయ్యింది. మీరు అతడి నుండి దూరంగా ఉండేందుకు ప్రయత్నించడం మంచి నిర్ణయం. సాధ్యం అయినంత వరకు ఆ ఉద్యోగం నుండి మారేందుకు ప్రయత్నించండి. మారలేని పక్షంలో అతడికి సీరియస్‌గా నాతో ఇక ఎలాంటి సంబంధం వద్దు, నా బతుకు నన్ను బతకనివ్వండి అంటూ చెప్పేయండి. ఆ తర్వాత కూడా అలాగే ప్రవర్తిస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తాను అంటూ చెప్పండి. పెళ్లి అయ్యింది కనుక కాస్త జాగ్రత్తగానే ఉంటాడనేది నా నమ్మకం.