News and Entertainment

జియో ఆఫర్‌పై అంబానీ అధికారిక ప్రకటన



జియోతో భారత టెలికాం రంగంను ఒక కుదుపు కుదిపిన ముఖేష్‌ అంబానీ మరోసారి తమ కస్టమర్లకు తీపి కబురు మోసుకు వచ్చాడు. జియో ప్రారంభ ఉచిత ఆఫర్‌ను డిసెంబర్‌ 31 వరకు కొనసాగిస్తాం అంటూ జియో ఆరంభ సదస్సులో పేర్కొనడం జరిగింది. అయితే ఆ ఆఫర్‌ను మరో మూడు నెలల పాటు కొనసాగించే అవకాశం ఉందని గత కొన్ని రోజులుగా మీడియాలో తారా స్థాయిలో వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆ వార్తలపై జియో అధినేత ముఖేస్‌ అంబానీ స్పష్టతను ఇచ్చాడు.



తాజాగా జియో ఫ్యామిలీ సభ్యుల మీటింగ్‌లో పాల్గొన్న అంబానీ ఆఫర్‌ను పొడగించబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన చేశారు. డిసెంబర్‌ 31 వరకు ఉచిత ఆఫర్స్‌ ముందుగా అనుకున్నప్పటికి, జియో పట్ల వినియోగదారులను మరింతగా ఆకర్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా అంబానీ చెప్పుకొచ్చారు. ఈ నిర్ణయంతో జియో వినియోగదారులు మరో మూడు నెలల పాటు పండుగ చేసుకోవచ్చు. జియో ఉచిత డేటాతో పాటు ఉచిత కాలింగ్‌ ఆఫర్‌ను ఇస్తున్న విషయం తెల్సిందే. మార్చి 31 తర్వాత జియో ఉచిత ఆఫర్‌ను తొలగించనుంది.