News and Entertainment

రిలయన్స్ జియో మరో బంపర్ ఆఫర్...ఈ దెబ్బతో అందరి మొబైల్ లో జియో సిమ్..!


రిలయన్స్ జియో మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇప్పటివరకు 4 జి ఫోన్లలో పని చేసే జియో సిమ్ ఇకపై 2 జి, 3 జి ఫోన్లలో కూడా పనిచేస్తుంది. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది ప్రజలు ఇప్పటికీ 2జీ,3జీ ఫోన్లనే వాడుతున్నారు. దీంతో వారిని ఆకర్షించేందుకు జియో ఈ నిర్ణయం తీసుకుంది. 2జీ, 3జీ ఫోన్లలో జియో ఎలా పనిచేస్తుందనే సందేహం చాలా మందికి కలగొచ్చు.

దానికి సంబంధించిన వివరాలను కూడా జియో చెప్పుకొచ్చింది. సిమ్ తీసుకున్న తర్వాత జియోఫై అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. ఆ తర్వాత జియో4జీవాయిస్ అప్లికేషన్‌ను మీ 2జీ, 3జీ స్మార్ట్‌ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలి. కొన్ని గంటల్లో సిమ్ యాక్టివేట్ కాగానే జియో ఫ్రీ వాయిస్ కాల్ సేవలు, డేటా సేవలను పొందవచ్చు.