News and Entertainment

ఫ్లాష్: జయలలిత ఆత్మ ఇంకా అక్కడక్కడే తిరుగుతుందంట..!!


జయలలిత భౌతికంగా మరణించిందే తప్ప ఆమె ఆత్మ ఇంకా అక్కడక్కడే తిరుగుతూ ఉంటుందట, ఆమె ఆత్మ శాంతించదట అయ్యబాబోయ్, ఇప్పటికే అంతుపట్టని ఆ తమిళరాణి అంతఃపుర కుట్రల కథలతోనే మెదళ్లు వాచిపోతున్నాయి, మళ్లీ ఏ కొత్త సిద్ధాంతం ఏమిట్రా బాబూ అని భయమేస్తున్నదా..? అవును తమిళ వైష్ణవులు జయలలిత అంత్యక్రియలు జరిగిన తీరుపై మండిపడుతున్నారు
ఈ ధోరణి తమ మనోభావాలను దెబ్బతీసిందనీ, జయలలిత ఆత్మకు శాంతి చేకూరదనీ అంటున్నారు జయలలిత పుట్టింది మాండ్యా జిల్లా, పాండవపుర తాలూకాలోని మేల్కొటే శ్రీవైష్ణవ బ్రాహ్మణ కుటుంబం ఆమె అంత్యక్రియల్ని తమ పద్ధతిలో చేయలేదనీ, ఒకరకంగా ఇది ఆమెను అవమానించినట్టేనని,
అంతేగాకుండా తమ మనోభావాలను కూడా అగౌరవపరిచారూ అనేది ఇప్పుడు ఆ ప్రాంత శ్రీవైష్ణవ బ్రాహ్మణులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు మీడియా సంస్థలకు లేఖలు రాస్తున్నారు వాళ్లు ప్రధానంగా అనేదేమిటీ అంటే . ‘‘మా సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరపకపోతే ఆత్మ శాంతించదూ, ప్రేతాత్మగా మారి అక్కడికక్కడే తిరుగుతూ ఉంటుంది ఇదీ మా నమ్మకం నిజానికి సంప్రదాయం ప్రకారం చితి పేర్చి, నిప్పంటించాలే తప్ప, ఇలా ద్రవిడ, క్రైస్తవ సంప్రదాయం మేరకు పెట్టెలో పెట్టి భూమిలో పాతిపెట్టడం సంప్రదాయ వ్యతిరేకం ’’

నిజానికి ఆ అంత్యక్రియలు జరిగినరోజే అందరిలోనూ సందేహాలు తలెత్తాయి షాక్ కు గురిచేసింది ఆమె రక్తబంధువులు అందుబాటులో ఉన్నా సరే, శశికళ తో అంత్యక్రియలు జరిపించడం అందరినీ విస్మయానికి కూడా గురిచేసింది జయలలిత జీవితాన్ని పూర్తిగా చెరబట్టిన శశికళ చివరకు మరణంలోనూ ఆమెను విడిచిపెట్టలేదు తను అనుకున్నట్టే, ఎవరినీ దగ్గరకు రానివ్వకుండా తనే అంత్యక్రియలు నిర్వహించింది నిజానికి తెలుగునాట ఉన్న సంప్రదాయం ప్రకారమైతే ఆమె అవివాహిత కాబట్టి ఖననం చేయాలి అయితే అది శవపేటికలో పెట్టి కాదు


ఒకవేళ శ్రీవైష్ణవ సంప్రదాయం ప్రకారమైతే దహనం చేయాలి ఆ రెండు రకాలుగా గాకుండా ఓ పెట్టెలో శవాన్ని పెట్టి, మేకులు కొట్టేసి, పూడ్చిపెట్టారు.,.. ఆమె జీవితాన్ని అన్నిరకాలుగా చెరబట్టిన శక్తులు అంత్యక్రియలను సక్రమంగా నిర్వర్తిస్తాయని నమ్మలేం, పైగా దహనం చేస్తే, ఎవరైనా ఆ అంత్యక్రియలు చేస్తే, వాళ్లకు ఆటోమేటిక్ గా కొన్ని హక్కులు సంక్రమిస్తాయనే భయంతోనే శశికళ ఈ నిర్ణయం తీసుకున్నారనే ప్రచారమూ ఉంది
సో... శ్రీవైష్ణవుల నమ్మకమే నిజమయ్యే పక్షంలో జయలలిత ఆత్మ ప్రేతాత్మగా మారి అక్కడక్కడే తిరుగుతూ ఉన్న పక్షంలో ఇప్పుడైనా సరే, శశికళ అండ్ మన్నార్ గుడి మాఫియాపై కక్ష తీర్చుకుంటుందా ?

Readషాకింగ్...ఆంధ్రప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి నారా బ్రాహ్మణి...!