News and Entertainment

పైకి అదో ఖరీదైన బ్యూటీపార్లల్‌.. లోపల మాత్రం పాడు పనులు



హైదరాబాద్‌లో అదో ఖరీదైన ఏరియా. అక్కడంతా కూడా ప్రముఖులు ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా అక్కడ సెలబ్రెటీలే ఉంటారు. వ్యాపారస్తులు మరియు రాజకీయనాయకులు, సినీమా వారు ఉండే ప్రాంతం అవ్వడంతో అక్కడ ఎవరికి అనుమానం రాదు అనే ఉద్దేశ్యంతో ఒక మహిళ తన పాడు బుద్దిని ప్రదర్శించింది. బ్యూటీ పార్లల్‌ పేరుతో బ్రోత్‌ హౌస్‌ నడిపించింది. దాదాపు రెండు సంవత్సరాలుగా సాగుతున్న గుట్టు తాజాగా రట్టు అయ్యింది.


వివరాల్లోకి వెళ్లే జూబ్లీహిల్స్‌లోని ఒక ఇండిపెండెట్‌ హౌస్‌లో సువర్ణ అనే మహిళ రెండు సంవత్సరాలుగా బ్యూటీ పార్లల్‌ నడుపుతూ ఉంటుంది. ఆడవారితో పాటు మగవారికి కూడా అక్కడ అన్ని రకాల కార్యక్రమాలు చేస్తారు. అయితే కొత్త వారికి కాదు. అంతా పాత వారికి మాత్రమే. కొత్త వారికి లోపల జరుగుతున్న విషయాలు కూడా తెలియకుండా జాగ్రత్త పడతారు. సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు నటీమనులు ఇక్కడ వచ్చే ఖరీదైన మగవారి కోర్కెలను భారీ మొత్తాలు తీసుకుని మరీ తీర్చుతూ ఉంటారు. ఎంతో గుట్టుగా సాగుతున్న ఈ ఖరీదైన వ్యభిచారం తాజాగా బయట పడటం జరిగింది. ఇప్పటి వరకు సువర్ణ కోట్లలోనే బిజినెస్‌ చేసినట్లుగా పోలీసు వర్గాల వారు చెబుతున్నారు.