News and Entertainment

జయలలిత కూతురి పై క్లారిటీ.. నిజం చెప్పిన ప్రముఖ గాయిని


తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత బతికి ఉన్న సమయంలో, చనిపోయిన తర్వాత ఆమె కూతురు అంటూ ఒక మహిళ ఫొటో సోషల్‌ మీడియా మరియు వెబ్‌ మీడియాలో తెగ హల్‌చల్‌ చేసిన విషయం తెల్సిందే. జయలలిత మొహంలో ఉన్న పోలికలు ఆ ఫొటోలో ఉన్న మహిళ పోలికలతో సరిగ్గా సెట్‌ అవుతున్న నేపథ్యంలో అంతా కూడా ఆమెను జయలలిత కూతురు అని భావించారు. శోభన్‌ బాబుకు జయలలితకు పుట్టిన కూతురుగా అంతా భావించారు. కాని ఆ వార్తల్లో నిజం లేదు అని, అసలు ఆ ఫొటోలోని మహిళకు జయలలితకు ఎలాంటి సంబంధం లేదు అని క్లారిటీ వచ్చేసింది.


ప్రముఖ గాయని, డబ్బింగ్‌ ఆర్టిస్టు చిన్మయి ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఆ ఫొటోలో ఉన్న మహిళ పేరు దివ్యా రామనాధన్‌ వీర రాఘవన్‌. ఈమె ఒక గొప్ప సంగీత విద్యాంస కుటుంబం నుండి వచ్చారు. ప్రస్తుతం కుటుంబంతో కలిసి ఈమె ఆస్ట్రేలియాలో జీవిస్తున్నారు. తమిళనాడు రాజకీయాలకు ఆమెకు ఎలాంటి సంబంధం లేదు అంటూ చిన్మయి క్లారిటీ ఇచ్చారు. ఇలాంటి వార్తలను సర్కులేట్‌ చేయడం మంచి పద్దతి కాదు అని మీడియా ప్రతినిధులకు చెప్పుకొచ్చింది.

Readఎన్టీఆర్ కంటే ముందు జయలలిత కే భారత రత్న ?