News and Entertainment

శోభన్‌బాబు, జయలలితల మద్య సంబంధం, ఒక పాప కూడా!



హీరోయిన్‌గా ఉన్న సమయంలో జయలలితతో స్టార్‌ హీరోలు సైతం సినిమాలు చేసేందుకు ఆసక్తిని కనబర్చేవారు. ముఖ్యంగా తెలుగు స్టార్‌ హీరో శోభన్‌బాబు ఒకానొక సమయంలో తాను 8 సంవత్సరాలుగా జయలలితతో సినిమా చేసేందుకు తపస్సు చేశాను అని, ఆ నిరీక్షణ ఇప్పటికి నెరవేరింది అంటూ ‘డాక్టర్‌ బాబు’ సినిమా సమయంలో చెప్పుకొచ్చారు. జయలలిత మొదట అందరు హీరోలతో ఎలా అయితే మసలుకుందో అలాగే శోభన్‌బాబుతో కూడా మసులుకునే వారు. కాని కొంత కాలంకే ఇద్దరి మద్య అన్యోన్యం బాగా పెరిగింది.


తల్లి చనిపోయి పుట్టెడు దుఖ:లో ఉన్న జయలలితను తన మాటతో, చేష్టలతో శోభన్‌ బాబు నవ్వించే ప్రయత్నం చేసేవారు. ఆమెకు కొండంత అండగా నిలిచారు. ఆ విషయాన్ని ఒకానొక సమయంలో జయలలిత స్వయంగా చెప్పారు. అమ్మ పోయాకా అంతా అయిపోయింది అనుకుంటున్న నాకు ఆయన మాటలు మనోధైర్యంను ఇచ్చాయి అని జయలలిత స్వయంగా తన మనస్సులోని మాటలను చెప్పారు. ఆ సమయంలోనే వీరిద్దరి మద్య వివాహేతర సంబంధం కొనసాగుతుందనే ప్రచారం కూడా ప్రారంభం అయ్యింది. వీరిద్దరికి ఒక పాప కూడా జన్మించిందని, ఆ పాప పేరు శోభన అంటూ పుకార్లు షికార్లు చేశాయి. ఇప్పటికి కూడా ఆ పుకార్లు పుకార్లుగానే ఉన్నాయి. వాటిని కొట్టిపారేసిన వారు కాని, నిజమని నిర్థారించిన వారు కాని లేరు.