News and Entertainment

మీ బాన పొట్ట చిన్న చిట్కాతో త‌గ్గించుకోండి..



మాన‌వ‌జీవన విధానం మారిపోయింది. తీవ్ర‌మైన ఒత్తిళ్ల‌లో ప‌ని చేయాల్సి రావ‌డంతో పాటు స‌రైన టైంకు తిండి, నిద్ర లేక‌పోవ‌డంతో పాటు ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ ఆహారం తీసుకోవ‌డంతో మ‌నుష్యులు లావెక్కి పోతున్నారు. ఇక కొంద‌రు ప‌రిమితికి మించిన తిండి తిన‌డం వ‌ల్ల కూడా భారీ కాయులుగా మారుతున్నారు. ఈ క్ర‌మంలోనే పొట్ట చుట్టూ పేరుకుపోయి ఉండే కొవ్వు వల్ల హృద్రోగాలు, మధుమేహం బారినపడే ప్రమాదం ఎక్కువ.

అయితే మ‌న‌కు ఉండే బాన పొట్ట‌ను త‌గ్గించుకునేందుకు ఓ సింపుల్ చిట్కా వ‌చ్చేసింది. ఈ చిట్కాతో ఆ బాన పొట్ట‌ను చ‌క్క‌గా త‌గ్గించుకోవ‌చ్చు. వంటల్లో ఆవనూనె వాడడం ద్వారా కేవలం నెల రోజుల్లోనే బాన పొట్టను తగ్గించుకోవచ్చని తాజా అధ్యయనంలో తేలింది. ఆవ నూనె లో ఉండే మోనోఅన్‌శాచ్యురేటెడ్‌ కొవ్వులు ఈ బెల్లీని తగ్గించేందుకు ఉపయోగపడుతాయని పెన్సిల్వేనియా వర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు.


సాధారణం గా శరీరంలో ఒక నిర్దిష్టమైన భాగంలో కొవ్వును/బరువును తగ్గించడం సాధ్యపడదు. కానీ, ఆవ నూనె లో ఉండే మోనోఅన్‌శాచ్యురేటెడ్‌ యాసిడ్స్‌ మాత్రం ప్రత్యేకించి పొట్ట భాగంలోనే ఉండే కొవ్వులను కరిగించడంలో తోడ్పడుతాయని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే, జన్యు మార్పిడి చేసిన ఆవాల నుంచి తీసిన నూనెను వినియోగిస్తే దుష్ప్రభావాలు కలిగే ప్రమాదం ఉందన్నారు. ఈ ఒక్క విష‌యంలో మాత్రం జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.