News and Entertainment

బ్లూ ఫిల్మ్ కేసు వెనుక చిరంజీవి హస్తముందా?: సుమన్ కు టీవీ 9 ప్రశ్న...!!



భారతీయ సినీ పరిశ్రమను ప్రాచీన, మధ్య, ఆధునిక సినీ పరిశ్రమగా విభజిస్తే సినిమా పరిశ్రమ అప్పుడప్పుడే ప్రేక్షక ఆదరణ పొందుతున్న రోజుల్లో అగ్ర నటులతో పోటీ పడుతూ వారికి ఏ మాత్రం తీసిపోనని వారితో పోటా పోటీగా నటించి తెలుగు ప్రజల ప్రేక్షక హృదయాలను కొల్లగొట్టిన నటుడు సుమన్. అప్పుడు అందానికి అందం, హైటుకు హైటు, బాడీ కి బాడీ ఉన్న నటుడు ఎవరంటే సుమనే అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి అంతటి ప్రాముఖ్యత కలిగిన నాటి వర్థమాన నటుడు సుమన్ ప్రస్తుతం సినిమాల్లో కనబడక చాలా సంవత్సరాలు అవుతుంది. అయితే దీని వెనకాల పెద్ద రహస్యమే దాగి ఉందని గ్రహించిన టీవీ ఛానెల్ టీవీ 9 ఆయనతో ప్రత్యేక ఇంటర్వ్యు ఏర్పాటు చేసి దానికి గల కారణాలు రాబట్టడానికి ప్రయత్నాలు చేసింది.

నీలి చిత్రాల కేసులో ఇరుక్కుని, ఏడాదికి పైగా జైల్లో గడిపి, ఆపై సినిమా అవకాశాలు సన్నిగిల్లి, ద్వితీయ స్థాయి హీరోగా పరిశ్రమలో మిగిలిపోయిన సుమన్, టీవీ 9 నిర్వహించే 'ఎన్ కౌంటర్ విత్ మురళీకృష్ణ'లో పాల్గొన్నాడు. ఇక సుమన్ జైలుకు వెళ్లిన విషయంలో ఇప్పటికీ తెలుగు సినీ అభిమానుల్లో ఉన్న అనుమానాన్నే ప్రశ్నగా ఆయన ముందుంచింది టీవీ 9.


బ్లూ ఫిల్మ్ కేసులో సుమన్ ను ఇరికించింది చిరంజీవేనని, ఇప్పటికీ ఆ ప్రచారం పెద్దఎత్తున ఉందని, దీనిని మీరు కూడా నమ్ముతున్నారా? అనే ప్రశ్న ఎదురైంది. దీనికి "గూండాస్ యాక్ట్ వేసిన కారణం ఏంటంటే, వన్ ఇయర్ బెయిల్ లేకుండా, వన్ ఇయర్ ఎట్టి పరిస్థితుల్లో శిక్షను అనుభవించాలని, నేను బయటకు రాకూడదని వాళ్లు ట్రై చేశారు" అన్న సుమన్ వ్యాఖ్యలను ప్రోమోలో టీవీ 9 చూపిస్తోంది. ఈ ప్రశ్నకు సుమన్ సమాధానం తెలియాలంటే, నేటి రాత్రి ప్రసారమయ్యే ఈ కార్యక్రమాన్ని చూడాల్సిందే.